ఏపీ సీఎం వైెెఎస్ జగన్ కోటరీ ఇదే: ఎవరు ఏమిటంటే....

First Published Jul 6, 2020, 5:15 PM IST

జగన్ చుట్టూ కోటరీ చేరిందని, వారు జగన్ ని వేరే ఎవ్వరితో కలవనివ్వకుండా చూస్తున్నారని, అన్నిటికి అడ్డు పడుతున్నారని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఈ కామెంట్స్ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయమై చాలా చర్చలే జరుగుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ నడుస్తుంది. ఆయన టీటీడీ భూముల విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం మొదలు ఇంగ్లీష్ మీడియం, ఇసుక, అవినీతి వరకు వైసీపీకి తలనొప్పిగా తయారయ్యారు.
undefined
ఆయన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తప్ప అందరిని ఉతికిఆరేసాడు. విజయసాయి రెడ్డినయితే ఎన్ని మాటలన్నాడో మనందరికీ తెలిసిందే. ఆయన ఈ విషయాలను ఎందుకోసం చేసాడు అనే విషయం పక్కనుంచితే... ఆయన ఒకే మాటను పదే పదే చెబుతుండేవారు.
undefined
తాను జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ పరిస్థితులు అన్ని వివరించడానికి ప్రయత్నించినప్పటికీ... అది సాధ్యపడలేదు అని, జగన్ మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ను కోరుతున్నానని పలుమార్లు అన్నాడు రఘురామ. టీవీ డిబేట్లలో కూడా అదే విషయాన్నీ చెప్పాడు. చివరకు తానుజగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో సైతం తనకు ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వమని కోరుతున్నట్టుగా రాసుకొచ్చాడు.
undefined
రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ కి ముందు సైతం కొందరు సొంత పార్టీ నేతలే పార్టీలోని మిగిలిన నేతలపై అసహనం వ్యక్తం చేసారు. మహీధర్ రెడ్డి, బ్రహ్మనాయుడు వంటి సీనియర్లు ఇసుక అక్రమాల విషయంలో తీవ్రమైన కామెంట్స్ చేసారు.
undefined
నెల్లూరు పెద్దా రెడ్లు పార్టీపైన్నే గుర్రుగా మారారు. కొందరు నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. రఘురామకృష్ణం రాజు ఒక్కడే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు సైతం తమకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదు అని వాపోయారు.
undefined
ఇక రఘురామకృష్ణం రాజు అయితే జగన్ చుట్టూ కోటరీచేరిందని, వారు జగన్ ని వేరే ఎవ్వరితో కలవనివ్వకుండా చూస్తున్నారని, అన్నిటికి అడ్డు పడుతున్నారని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఈ కామెంట్స్ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయమై చాలా చర్చలే జరుగుతున్నాయి.
undefined
జగన్ చుట్టూ కోటరీచేరిందని, జగన్ కేవలం కోటరీమాటలే వింటున్నాడని పలువురు నేతలు అంటున్నారు. జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరిని వీరు ఇప్పుడు జగన్ కోటరీ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా కోటరీ గా పాపులర్ అయిన ఈ నేతలు ఎవరో ఒకసారి చూద్దాం.
undefined
విజయసాయి రెడ్డివైసీపీ రాజ్యసభ ఎంపీ. జగన్ కి ఆత్మగా అభివర్ణిస్తుంటారు. రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలాగో జగన్ కు విజయసాయి రెడ్డి అలాగే అని అంటారు. ఎప్పటినుండో జగన్ కి తోడుగా నీడలా వెన్నంటే ఉన్నాడు. జగన్ గెలుపులో కీలక పాత్రా పోషించాడు. తనకు జగన్ తోని ఉన్న సన్నిహిత సంబంధం వల్ల జగన్ వెన్నంటే ఉంటాడు విజయసాయి రెడ్డి
undefined
సజ్జల రామకృష్ణ రెడ్డిజగన్ కి నమ్మిన బంటు. మాజీ పాత్రికేయుడు. ఉదయం పేపర్లో బ్యూరో చీఫ్ గా పనిచేసాడు. ఎప్పటి నుండో జగన్ వెన్నంటే ఉన్నాడు. తాజాగా సజ్జలకు పార్టీలోని ముఖ్యబాధ్యతలతోపాటుగా హెడ్ ఆఫీస్ ని చూసుకోవాలిసిందిగా, దానికి ఇంచార్జి ని చేసాడు జగన్. ఈయనే పార్టీలో కొత్త నెంబర్ 2 అని ప్రచారం సాగుతుంది.
undefined
వైవీ సుబ్బా రెడ్డిజగన్ సన్నిహితుడు, సమీప బంధువు కూడా. ప్రస్తుత టీటీడీ చైర్మన్. జగన్ కి అత్యంత నమ్మకస్థుడు. మొన్న జగన్ నియమించిన ఇంచార్జిల్లో కోస్తాను చూసుకునేవాడు ఇతనే. పార్టీపై మంచి పట్టున్న వాడు గతంలో ఎంపీగా కూడా పనిచేసాడు.
undefined
తలశిల రఘురాంటీవీల్లో ఈ పేరు ఎక్కువగా వినబడదు. జగన్ పాదయాత్రను క్లోజ్ గా చూసిన వారికి మాత్రం ఈ పేరు సుపరిచితమే. ఆయన ఎక్కువగా మీడియాలో కనబడకున్నప్పటికి... జగన్ అన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసేది ఈయనే. ప్రస్తుతానికి కాబినెట్ హోదా కలిగిన సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పదవిలో కొనసాగుతున్నాడు. జగన్ ఎక్కడ ఏ మీటింగ్ కి వెళ్లాలన్నాదాని అన్ని ఏర్పాట్లను చూసుకునేది ఈయనే.
undefined
click me!