అన్న క్యాంటిన్ కూల్చివేత: జగన్ దూకుడు, పేర్ల మార్పు

First Published Jun 1, 2019, 10:57 AM IST

అమరావతి: పాలనలో ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాలను పునర్వ్యస్థీకరించడం, అధికారుల బదిలీ వంటి పలు మార్పులకు ఇప్పటికే ఆయన చర్యలు తీసుకున్నారు. తాజాగా, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల మార్పునకు శ్రీకారం చుట్టారు.

undefined
గుంటూరు జిల్లా పలనాడు మాచర్ల పట్టణంలోని అన్నా క్యాంటిన్ ను కూల్చివేశారు. దీన్ని ఎవరు కూల్చివేశారనేది తెలియదు. పేదలకు రూ. 5 భోజనం అందించే ఈ క్యాంటిన్ కూల్చివేతకు గురి కావడం కలకలం రేపుతోంది.
undefined
అన్నా క్యాంటిన్ పేరును పూర్తిగా మార్చేసే పనికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. అన్నా క్యాంటిన్ ను రాజన్న క్యాంటిన్ గా మార్చేస్తూ పేర్లు వెలుస్తున్నాయి. ఇది అధికారికంగా జరిగిందా, అనధికారికంగా జరిగిందా అనే తెలియదు.
undefined
చంద్రబాబు ప్రభుత్వ హయంలోని పథకాల పేర్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దూకుడగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలను సమీక్షించే పనికి కూడా జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.
undefined
click me!