చంద్రబాబును ఎండగట్టిన మోహన్ బాబు: జగన్ బంపర్ ఆఫర్ ఇదే...

First Published May 31, 2019, 6:10 PM IST

ప్రముఖ నటుడు,వైసీపీ నేత మంచు మోహన్ బాబుకు అదృష్టం తలుపుతట్టిందా...? ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నక్కతోక తొక్కారా...? ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుని ఓ ఆట ఆడుకున్న కలెక్షన్ కింగ్ వైసీపీ అధినేత వైయస్ జగన్ దృష్టిలో పడ్డారా..? 
 

సరైన సమయంలో పార్టీలోకి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎక్కడికక్కడ చంద్రబాబును ఎండగట్టిన మోహన్ బాబు వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పని విధంగా చంద్రబాబు గురించి తీవ్ర ఆరోపణలు చేశారు మోహన్ బాబు.
undefined
వైస్రాయ్ ఘటన, హెరిటేజ్, చంద్రబాబు వ్యహార శైలి, తాను టీడీపీకి దూరం కావాల్సిన పరిస్థితులపై పూసగుచ్చినట్లు చెప్పి చంద్రబాబు ఇమేజ్ ను డామేజ్ చేయడంలో మోహన్ బాబు దిట్ట అని చెప్పుకోవచ్చు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే మోహన్ బాబు చంద్రబాబును టార్గెట్ చేస్తూ దూసుకుపోయారు.
undefined
ఆయనే కాదు తన పెద్దకుమారుడు మంచు విష్ణును సైతం ఎన్నికల ప్రచారంలో దింపారు. మంచు విష్ణు చిత్తూరు, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటించి వారి విజయంలో కీలక పాత్ర పోషించారు.
undefined
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో మోహన్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు కేవలం పార్టీ కార్యకర్త మాత్రమే కాదు జగన్ కు బంధువు కూడా. వైయస్ జగన్ కు వరుసకు మావయ్య అవుతారు మోహన్ బాబు.
undefined
అందుకే జగన్ మోహన్ బాబును మావయ్య అని పిలుస్తారని మోహన్ బాబు ఇటీవలే మీడియాతో చెప్పారు కూడా. వైయస్ జగన్ చిన్నాన్న కుమార్తె విరానికాను మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణుకు ఇచ్చి వివాహం చేశారు. ఆనాటి నుంచి వీరిమధ్య బంధం మరింత బలపడింది.
undefined
ఇరువురు బంధువులు కావడంతో పలు వేడుకల్లో పాలుపంచుకుంటూ ఉంటారు కూడా. 2014 ఎన్నికల్లో మోహన్ బాబు సైలెంట్ గా ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ అధినేత వైయస్ జగన్ కు అండగా నిలిచారు.
undefined
చంద్రబాబు టార్గెట్ గా రెచ్చిపోయారు. తిట్టిన తిట్టు తిట్టకుండా చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబుకు మంచి పదవి కట్టబెడతారంటూ ప్రచారం జరుగుతుంది.
undefined
గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మరో ఏడాదిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నుంచి నాలుగు రాజ్యసభ సభ్యులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబును రాజ్యసభకు పంపిస్తారా అన్న చర్చ జరుగుతోంది.
undefined
ఆధ్యాత్మికంగా, భక్తిభావం కలిగిన మోహన్ బాబును టీటీడీ చైర్మన్ గా నియమిస్తారా అంటూ మరో చర్చ జరుగుతుంది. లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ కేబినెట్ లో ఆహ్వానిస్తారా అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అయితే మోహన్ బాబు నిర్మోహమాటస్తుడు. ఏదైనా కుండబద్దలు కొడతాడు.
undefined
వేదిక ఏదని కూడా చూడరు చెడామడా ఎదుటి వారిని కడిగేయడం ఆయనకు అలవాటు. అందుకే సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబుతో పెట్టుకోవడం అంటే మామూలుగా ఉండదంటారు. అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకుంటే లేనిపోని చిక్కులు వస్తాయని వైసీపీలో కొందరు అంటున్నారట.
undefined
ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు ఏ పదవి ఇవ్వాలో అన్న అంశంపై వైసీపీ కేంద్ర శిబిరంలో చర్చ జరుగుతోందట. రాజ్యసభకు పంపాలా....లేక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కట్టబెట్టాలా లేక ఎమ్మెల్సీ చేసి తనతోపాటే ఉంచుకోవాలా అన్న అంశాలపై వైయస్ జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
మరోవైపు వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సైతం మోహన్ బాబు గురించి జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు స్వరూపానందేంద్ర సరస్వతికి కూడా సన్నిహితుడే.
undefined
సీఎం వైయస్ జగన్ కు స్వరూపానందేంద్ర సరస్వతి అంటే ఎంతో గౌరవం ఆయన ఏం చెప్పినా కాదనకుండా జగన్ చేయడం అలవాటు అంటూ ఉంటారు. స్వరూపానందేంద్ర సరస్వతి సిఫారసు చేయడంతో మోహన్ బాబుకు కీలక పదవి మాత్రం ఖాయమని ప్రచారం జరుగుతుంది.
undefined
click me!