ఇద్దరు పిల్లలు ఉండాలన్న నిబంధన ఎత్తివేత..
గవర్నర్ స్పీచ్‌లో భాగంగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను ఎత్తి వేశామని తెలిపారు. గత డిసెంబర్‌లో ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను రద్దు చేసి, చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
అయితే కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఏపీ సమయంలో ఇద్దరికంటే ఎక్కువమంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా నిర్ణయిస్తూ చట్టం చేశారు. దీనిపై గత 30ఏళ్లుగా ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేసింది.