భూములను ఇవ్వదలచుకోని రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినా, రైతుల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం పేర్కొన్నారు.ఇక ఈ అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. సిద్దరామయ్య రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. సామాజిక న్యాయం మాటల్లో కాదు, పనుల్లో చూపారని అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఏరోస్పేస్ పార్క్ స్థాపనకు కొత్త అవకాశాలు తలుపుతట్టాయి. ఈ అవకాశాన్ని పట్టాలెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తూ, పెట్టుబడిదారులకు దోహదం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పునర్‌ప్రారంభానికి అనుగుణంగా రాష్ట్రం లోకేష్ నేతృత్వంలోని ఐటీ విభాగం ద్వారా పరిశ్రమలకు కొత్త ఊపునిచ్చే ప్రయత్నాల్లో ఉంది.