పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అందువల్ల ఈ పొత్తు ఖరారు కావడం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. జనసేనను విలీనం చేయాలని తాము అడిగినప్పటికీ పవన్ కల్యాణ్ అంగీకరించకపోవడంతో చివరకు పొత్తుకు బిజెపి సిద్ధపడింది. వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి బిజెపికి అంతకు మించిన ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించలేదు
undefined
పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అందువల్ల ఈ పొత్తు ఖరారు కావడం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. జనసేనను విలీనం చేయాలని తాము అడిగినప్పటికీ పవన్ కల్యాణ్ అంగీకరించకపోవడంతో చివరకు పొత్తుకు బిజెపి సిద్ధపడింది. వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి బిజెపికి అంతకు మించిన ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించలేదు
undefined
పవన్ కల్యాణ్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కూడగట్టే చరిష్మా ఉంది. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచినప్పటికీ బిజెపి ఓట్లు కూడా కలిస్తే బలం పెరిగే అవకాశాలు లేకపోలేదు. భవిష్యత్తులో జనసేన, బిజెపి పొత్తు వల్ల సంభవించబోయే పరిణామాల గురించి వైఎస్ జగన్ కు గుబులు పట్టుకున్నట్లే అనుకోవాలి. రాజకీయంగానే కాకుండా ఇతరత్రా కూడా వైఎస్ జగన్ కు చిక్కులు ఎదురు కావచ్చు.
undefined
ఇకపోతే, టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఒక్కరకంగా షాక్. పవన్ కల్యాణ్ తో పొత్తు లేదా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని చంద్రబాబు ఆశిస్తూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నట్లే కనిపించారు. కానీ, ఒక్కసారిగా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్ధపడ్డారు. ఇది చంద్రబాబుకు అయిష్టమైన వ్యవహారమే
undefined
తమకు వైసీపీ గానీ టీడీపీ గానీ సన్నిహితంగా లేవని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అందువల్ల జనసేన, బిజెపి కూటమిలోకి టీడీపీ వచ్చే అవకాశాలు అంతగా లేవు. రహస్య అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో అటువంటిది జరిగితే తాను ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు అనుకుంటారు. ఇది బిజెపికి ఏ మాత్రం ఇష్టం లేని విషయం. అందువల్ల బిజెపి చంద్రబాబుతో కలిసి నడిచే అవకాశాలు అరుదుగానే ఉన్నాయని చెప్పవచ్చు.
undefined
అదే సమయంలో బిజెపితో పొత్తు ఖరారైన తర్వాత పవన్ కల్యాణ్ చంద్రబాబుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో ఆయన చంద్రబాబును తప్పు పట్టారు. అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించకపోతే బాగుండేదని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల చంద్రబాబుతో దోస్తీ కుదురుతుందని ఇప్పటికిప్పుడైతే అనుకోలేం. తొలుత చంద్రబాబును వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి రావాలని, ఆ తర్వాత వైఎస్ జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలనేది పవన్ కల్యాణ్ వ్యూహంగా భావించవచ్చు.
undefined