32ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3: స్పెసిఫికేషన్స్..

By rajashekhar garrepally  |  First Published Apr 24, 2019, 2:54 PM IST

జియోమీ రెడ్‌మీ సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మీ వై సిరీస్‌లో వై3 స్మార్ట్‌ఫోన్‌ను జియోమీ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. 


జియోమీ రెడ్‌మీ సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మీ వై సిరీస్‌లో వై3 స్మార్ట్‌ఫోన్‌ను జియోమీ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. 

రెడ్‌మీ వై3 అదనపు ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 32 ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ సెంట్రిక్ డివైస్‌గా రెడ్‌మీ వై3ని తీసుకొచ్చినట్లు జీయోమీ పేర్కొంది. వెలుతురు తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ సెల్ఫీ కెమెరా మంచి క్వాలిటీ ఫొటోలను తీయగలదని తెలిపింది. 

Latest Videos

undefined

వెనుకవైపు ఈ ఫోన్‌కి డ్యూయెల్ కెమెరాలు కలిగివున్నాయి. ప్రైమరీ కెమెరా 12మెగా పిక్సెల్స్ ఉండగా, డెప్త్ కెమెరా 2 మెగా పిక్సెల్ ఉంది. జియోమీ వై3ని రెండు వేరియెంట్లలో విడుదల చేసింది.

ధరలు: 

3జీబీ ర్యామ్‌ , 32 జీబీ స్టోరేజ్‌: రూ. 9999
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌: రూ. 11,999

ఏప్రిల్‌ 30 నుంచి  అమెజాన్‌, ఎంఐ, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్ల ద్వారా ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. రెడ్‌మీ వై 3 కొనుగోలుదారులకు ఎయిర్‌టెల్‌  ద్వారా 1000 జీబీ 4జీ డేటా ఉచితం, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. 

రెడ్‌మి  వై 3 ఫీచర్లు: 

6.26 డాట్‌నాచ్‌ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌  కాల్కామ్‌ 632 ఎస్ఓసీ
ఆండ్రాయిడ్‌ పై 9
1440x720  పిక్సెల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
32 ఎంపీ  సూపర్‌ సెల్ఫీ కెమెరా
12+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
360 ఏఐ ఫేస్ అన్‌లాక్

వై3 లాంచ్ సందర్భంగా జియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ మాట్లాడుతూ.. దేశంలోని 19 రాష్ట్రాల్లోని 300 నగరాల్లో 1000కిపైగా ఎంఐ స్టోర్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. 10,000 ఆఫ్‌‌లైన్ రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యంగా ఆయన చెప్పారు.

click me!