స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం రియల్‌మీ తన మూడవ జనరేషన్ రియల్‌మీ 3ని దాదాపు నెల రోజుల క్రితం విడుదల చేసింది. అప్పుడే రియల్‌మీ 3ప్రోను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. తాజాగా, సోమవారం రియల్‌మీ 3 ప్రోను సరికొత్త ఫీచర్లతో విడుదల చేసింది రియల్‌మీ.
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం రియల్‌మీ తన మూడవ జనరేషన్ రియల్‌మీ 3ని దాదాపు నెల రోజుల క్రితం విడుదల చేసింది. అప్పుడే రియల్‌మీ 3ప్రోను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. తాజాగా, సోమవారం రియల్‌మీ 3 ప్రోను సరికొత్త ఫీచర్లతో విడుదల చేసింది రియల్‌మీ.
రెడ్ మీ నోట్ 7 ప్రోకు పోటీగా రియల్‌మీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. రియల్ మీ2 ప్రోకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను అంచనాలకు అనుగుణంగానే రూ. 13,999గా నిర్ణయించింది.
రియల్‌మీ 3ప్రో చూడటానికి ఆకర్షనీయంగా ఉంది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌నున లాంచ్ చేసింది. పబ్‌జీ లాంటి గేమింగ్, వూక్3.0 ఫ్లాష్ చార్జ్, అద్భుతమైన సోనీ కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది.
29 ఏప్రిల్ నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి. కామ్ ద్వారా అందుబాటులో ఉండనుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా వెయ్యిరూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
4జీబీ ర్యామ్, 32 జీబీస్టోరేజ్ రూ.13,999
6జీబీ ర్యామ్ 128 జీబీస్టోరేజ్ ధర రూ. 16,999
దీంతో పాటో రియల్‌మి సీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 5,999.
రియల్ మీ 3 ప్రో ఫీచర్లు:
6.30 అంగుళాల డిస్‌ప్లే(1080x3240 రిజల్యూషన్)
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ పై 9.0
4జీబీ/6జీబీ ర్యామ్, 64/128 జీబీస్టోరేజ్
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
16+5 ఎంపీ రియర్ కెమెరా
4045 ఎంఏహెచ్ బ్యాటరీ.
చదవండి: పబ్‌జీ మొబైల్ 0.12.0 అప్డేట్: కొత్త ఆయుధాలు, ఫీచర్లు ఇవే..