రియల్‌మీ నుంచి మరో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. సోమవారం రియల్‌మీ సీ2ను ఆ సంస్థ భారత విపణిలోకి విడుదల చేసింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు దీని ప్రత్యేకత.
రియల్‌మీ నుంచి మరో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. సోమవారం రియల్‌మీ సీ2ను ఆ సంస్థ భారత విపణిలోకి విడుదల చేసింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు దీని ప్రత్యేకత.
స్పోర్ట్స్ డ్యూయెల్ రియర్ కెమెరా, మీడియా టెక్ హీలియో పీ22 ఎస్ఓసీ, 3జీబీ ర్యామ్ కలిగివుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం10, రెడ్‌మీ 7 ఫోన్లకు పోటీగా ఈ ఫోన్ తీసుకొచ్చింది రియల్‌మీ. 16జీబీ, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ వేరియెంట్లు ఉన్నాయి.
undefined
రియల్‌మీ సీ2.. 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజీ వేరియెంట్ ధర రూ.5,999గా ఉంది. ఇక 3జీబీ ర్యామ్+32జీబీ మోడల్ ధర రూ. 7.999. ఈ ఫోన్లు డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక సైట్లలో లభ్యమవుతాయి. మే 15న మధ్యాహ్నాం 12గంటలకు తొలిసేల్ ప్రారంభం కానుంది.
రియల్ మీ సీ2 స్పెసిఫికేషన్స్:
డ్యూయల్ సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్
6.1 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పీ22 ఎస్ఓసీ 2జీబీ, 3జీబీ వేరియంట్లు ఉన్నాయి.
రియల్‌మి సి2లో వెనకవైపు రెండు కెమెరాలున్నాయి. అందులో ఒకటి 13 మెగాపిక్సల్ కాగా, మరోటి 2 మెగాపిక్సల్. ముందువైపు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది.
అలాగే, ఆర్టిఫిషియల్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో 32 జీబీ, 64 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం కలిగిన రెండు రకాల స్మార్ట్‌ఫోన్లు ఉండగా.. అంతర్గత మెమొరీని ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే వెసులుబాటు ఉంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మొత్తానికి ఈ ధరలో రియల్‌మీ సీ2 వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
చదవండి: బడ్జెట్ ధరలోనే మార్కెట్లోకి రియల్ మీ 3 ప్రో: స్పెసిఫికేషన్స్..