అదనపు ఫీచర్లతో రూపొందిన రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను జియోమీ బుధవారం విడుదల చేసింది. ఇన్‌బిల్డ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పెషల్ డిజైన్‌తో లూనర్ రెడ్, కమెంట్ బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఆవిష్కరించింది.
అదనపు ఫీచర్లతో రూపొందిన రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను జియోమీ బుధవారం విడుదల చేసింది. ఇన్‌బిల్డ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పెషల్ డిజైన్‌తో లూనర్ రెడ్, కమెంట్ బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఆవిష్కరించింది. రెడ్‌మీ 6తో పోలీస్తే స్క్రీన్, కెమెరా, బ్యాటరీ తదితర విషయాల్లో అద్భుతమైన అప్‌డేట్స్‌తో రెడ్‌మీ 7 లాంచ్ చేసినట్లు జియోమీ ఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు.
ఏప్రిల్ 29 నుంచి అమెజాన్ తోపాటు ఎంఐ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుందని తెలిపారు. కాగా, రెడ్ మీ 7 కొనుగోలు చేసిన వినియోగదారులకు నాలుగేళ్లపాటు డబుల్ డేటా, 2400 రూపాయల క్యాష్‌బ్యాక్ జియో ద్వారా లభ్యం కానుంది.
రెడ్ మీ 7 ఫీచర్లు
6.26 డిస్‌ప్లే డాట్ నాచ్
12+2 ఎంపీ ఏఐ డ్యూయెల్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
స్నాప్ డ్రాగన్ 632 ఎస్ఓసీ
రెండు వేరియెంట్లలో విడుదలైన ఈ మొబైళ్ల ధరలు పరిశీలిస్తే..
2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజీ వేరియెంట్ ధర: రూ. 7,999
3జీబీ ర్యామ్+ 32 స్టోరేజీ వేరియెంట్ ధర రూ. 8,999
రెడ్ మీ 7 తోపాటు రెడ్ మీ వై 3 స్మార్ట్‌ఫోన్‌ను, ఎల్ఈడీ స్మార్ట్ బల్బును కూడా బుధవారం ఈ కార్యక్రమంలో విడుదల చేసింది. ఏకంగా 16 మిలియన్ల రంగుల్లో ఎల్ఈడీ రంగుల్లో ఈ స్మార్ట్ బల్పులను లాంచ్ చేయడం గమనార్హం.
11ఏళ్ల లాంగ్ లైఫ్ అందించే ఈ స్మార్ట్ బల్బులను ఎంఐ హోం యాప్, ఎలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో మాత్రమే లభిస్తున్నాయి. ఏప్రిల్ 26 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.
చదవండి: 32ఎంపీ సూపర్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3: స్పెసిఫికేషన్స్..