సరికొత్త క్రిస్టల్ 4 కె యుహెచ్‌డి, ఆన్ బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్ టివిలను ప్రస్తుత లైనప్‌కు సామ్‌సంగ్ జోడించింది. కొత్త లైనప్ టీవీలు చాలా స్పష్టమైన క్లారీటి "అసాధారణమైన రంగులు, డీప్ కాంట్రాస్ట్, స్మార్ట్ ఫీచర్లను" అందించే విధంగా ఈ టీవీలను రూపొందించినట్లు పేర్కొంది.
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సౌత్ కొరియా కంపెనీ సామ్‌సంగ్ కొత్త స్మార్ట్ టీవీలను ఇండియాలో ప్రకటించింది. సరికొత్త క్రిస్టల్ 4 కె యుహెచ్‌డి, ఆన్ బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్ టివిలను ప్రస్తుత లైనప్‌కు సామ్‌సంగ్ జోడించింది. కొత్త లైనప్ టీవీలు చాలా స్పష్టమైన క్లారీటి "అసాధారణమైన రంగులు, డీప్ కాంట్రాస్ట్, స్మార్ట్ ఫీచర్లను" అందించే విధంగా ఈ టీవీలను రూపొందించినట్లు పేర్కొంది.
2020 క్రిస్టల్ 4కె యుహెచ్‌డి టివి లైనప్ సామ్‌సంగ్ క్రిస్టల్ టెక్నాలజీతో పనిచేస్తుంది, ఇది "లైఫ్‌లైక్ 4కె రిజల్యూషన్" కోసం క్రిస్టల్ 4కె ప్రాసెసర్‌తో డైనమిక్ క్రిస్టల్ డిస్ ప్లే, 4కె క్వాలిటీ, ఇన్‌బిల్ట్ ఏఐ(AI)ని అందిస్తుంది. ఈ కొత్త టీవీలు డ్యూయల్ ఎల్‌ఈడీ బ్యాక్‌లైటింగ్, సామ్‌సంగ్ సరికొత్త మల్టీ-వ్యూ టెక్నాలజీని కూడా అందిస్తున్నాయి. ప్రత్యేక వాల్యూమ్ అవుట్ పుట్ కంట్రోల్ తో స్క్రీన్ ని రెండు భాగాలుగా విభజించడానికి ఇది అనుమతిస్తుంది. డిజైన్ పరంగా, క్రిస్టల్ యూహెచ్‌డి టీవీలు మూడు వైపుల బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.
కొత్త క్రిస్టల్ రేంజ్ టీవీలు 43, 50, 55, 65, 75 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉండగా. అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0టీవీలు 32, 43 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో లభిస్తున్నాయి. 2020 క్రిస్టల్ 4కె యుహెచ్‌డి లైనప్ టీవీలు సామ్‌సంగ్ స్మార్ట్ ప్లాజాస్, అన్ని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో లభిస్తుంది. అన్ బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్ స్మార్ట్ టీవీలు రెండు సైజులలో ఒకటి 32-అంగుళాలు మరొకటి 43-అంగుళాలలో లభిస్తాయి.
2020 స్మార్ట్ టీవీలు సామ్‌సంగ్ స్థానిక బిక్స్ బై, అమెజాన్ అలెక్సా వంటి మల్టీ వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ చేస్తుంది. అదనంగా ఈ కొత్త స్మార్ట్ టీవీ మోడల్స్ పర్సనల్ కంప్యూటర్, కంటెంట్ గైడ్, మ్యూజిక్ సిస్టమ్, ఆటో హాట్ స్పాట్, లైవ్ కాస్ట్, హోమ్ క్లౌడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. “క్రిస్టల్ టెక్నాలజీతో సరికొత్త క్రిస్టల్ 4కె యుహెచ్‌డి టివిలు ఉత్కంఠభరితమైన, లీనమయ్యే టీవీ వీక్షణ అనుభవాన్ని, అసాధారణ రంగులను అందిస్తుంది.
also read ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్.. ...
యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఈరోస్ నౌ, సోనీ లివ్, వూట్ తదితర యాప్స్‌ను ఈ టీవీలలో ఇన్‌బిల్ట్‌గా అందిస్తోంది.ఈ టీవీలను కొనుగోలు చేసేవారికి శాంసంగ్ ఉచితంగా ఆఫీస్ 365 సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అలాగే 5జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డులతో టీవీలను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం” అని సామ్‌సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.
సామ్‌సంగ్ స్మార్ట్ టివి ధరలు
అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0
32 ఇంచుల టీవీ ధర రూ.20,900గా ఉంది.
43 ఇంచుల టీవీ ధర రూ.41,900గా ఉంది.
క్రిస్టల్ 4కె యూహెచ్‌డీ సిరీస్‌లో
43 ఇంచుల టీవీ ధర 44,400 రూపాయలు
50 ఇంచుల టీవీ ధర 60,900 రూపాయలు
55 ఇంచుల టీవీ ధర 67,900 రూపాయలు
65 ఇంచుల టీవీ ధర 1,32,900 రూపాయలు
75 ఇంచుల టీవీ ధర 2,37,900 రూపాయలు