పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్... ఎప్పుడంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Jul 3, 2020, 4:45 PM IST

 పోకో ఎం 2 ప్రో జూలై 7 న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్‌లను లాంచ్ కి ముందే వెల్లడించింది. 


చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ తేదీని ప్రకటించింది. పోకో ఎం 2 ప్రో జూలై 7 న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్‌లను లాంచ్ కి ముందే వెల్లడించింది.

కొత్త మోడల్‌కు చెందిన  పోకో ఎం2 ప్రో ఫొటోను చైనీస్‌  బ్రాండ్‌  పోకో తన సోషల్ మీడియా అక్కౌంట్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. పోకో స్మార్ట్ ఫోన్ లాంచ్ కి కొద్ది రోజుల ముందే స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ స్పెసిఫికేషన్లను వెల్లడిస్తు మరో టీజర్‌ను కూడా కంపెనీ షేర్ చేసింది.

Latest Videos

undefined

పోకో ఎం2 ప్రో  సింగిల్-కోర్ టెస్ట్ లో 554, మల్టీ-కోర్ టెస్ట్ లో 1757 స్కోరు వచ్చినట్లు పోస్ట్ చేసింది. పోకో ఎం2 ప్రో ఆండ్రాయిడ్ 10 తో రానుందని, దీనిలో 1.8జి‌హెచ్‌జెడ్  బేస్ ఫ్రీక్వెన్సీతో క్వాల్కమ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం.

also read  

అయితే ప్రాసెసర్ మోడల్ పై ఎలాంటి సమాచారం లేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జి కావచ్చు ఆని పుకార్లు వినిపిస్తున్నాయి. 6 జీబీ ర్యామ్‌తో ఇది లాంచ్ అవుతున్నట్లు అలాగే పోకో రిటైల్ పార్ట్నర్ ఫ్లిప్‌కార్ట్ కూడా రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం కొత్త పేజీని కూడా  క్రియేట్ చేసింది.

పోకో ఎం2 ప్రో 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్నట్లు ఫోటో ద్వారా తెలుస్తుంది. బ్యాటరీ సామర్థ్యం గురించి ఇంకా వివరాలు వెల్లడికాలేదు. కనెక్టివిటీలో బ్లూటూత్ 5, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ కొత్తఫోన్లను ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌  ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని పోకో ఇండియా జనరల్‌ మేనేజర్‌ సీ మన్మోహన్‌ వివరించారు.  జూలై 7వ తేదీ మధ్యాహ్నం నుంచి లాంచింగ్‌ ఈవెంట్‌ ఆరంభంకానుంది. అదేరోజు ఫోన్లు ఎప్పుడు విక్రయిస్తామనే విషయాన్ని కూడా కంపెనీ ప్రకటించనుంది.  
 

click me!