హోల్-పంచ్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటున్న వివో కొత్త స్మార్ట్ ఫోన్.. నేడే లాంచ్

By Sandra Ashok Kumar  |  First Published Jul 3, 2020, 5:36 PM IST

వివో వై 30 మొదట మలేషియాలో లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్స్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 


ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో కొత్త  వై-సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్ వివో వై30ని  నేడు భారత్‌లో లాంచ్‌ చేసింది. వివో వై 30 మొదట మలేషియాలో లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్స్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

కంపెనీ అధికారిక సైట్‌లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ జాబితా చేసింది. ఇందులో ఫ్లిప్‌కార్ట్ ధర ఇతర వివరాలను కూడా వెల్లడిస్తుంది. వివో వై 30 వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఫోన్ హోల్ -పంచ్ డిస్ ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది.

Latest Videos


భారతదేశంలో వివో వై 30 ధర, సేల్స్ వివరాలు

వివో వై30 ధర 4జి‌బి ర్యామ్ + 128జి‌బి  స్టోరేజ్ ధర రూ.14,990. డాజిల్ బ్లూ, ఎమరాల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ-కామర్స్ యాప్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ రోజు రాత్రి 8 గంటలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 10 శాతం ఆఫర్, యుపిఐ ద్వారా మొదటి ప్రీపెయిడ్ లావాదేవీకి 30 శాతం ఆఫ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5% ఆన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, నో-కాస్ట్ ఇఎంఐ కూడా అందిస్తుంది. వివో వై 30 కంపెనీ వెబ్‌సైట్‌ లో ఫోన్ లాంచ్‌కు సంబంధించి వివో ఎటువంటి ప్రకటనలు చేయలేదు. 

also read 

వివో వై 30 ఫీచర్స్

స్పెసిఫికేషన్లకు వస్తే, డ్యూయల్ సిమ్ (నానో + నానో), వివో వై30 ఆండ్రాయిడ్ 10 లో ఫన్‌టచ్ ఓఎస్‌, 6.47-అంగుళాల హెచ్‌డి + (720x1560 పిక్సెల్స్)ఎల్‌సి‌డి డిస్‌ప్లే,  ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి35, 4జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ అందిస్తుంది. ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి 250జి‌బి వరకు పెంచుకోవచ్చు.


వివో వై30లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్, రెగ్యులర్ ఎఫ్ / 2.2 లెన్స్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్ / 2.2 లెన్స్‌, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో మరో 2 మెగాపిక్సెల్ షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం వివో వై30 ముందు భాగంలో ఎఫ్/2.05 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ‌ఐ) ఫీచర్ కు సపోర్ట్ చేస్తుంది.

వివో వై30 వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అంతేకాకుండా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 197 గ్రాముల బరువు ఉంటుంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఫీచర్స్ లో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
 

click me!