ఈ ఆఫర్లు 31 జనవరి 2021 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వినియోగదారుల రిటైలర్ స్టోర్ లలో లభిస్తాయి.
ఎలక్టోనిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ టీవీలలో 55 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ సైజ్ ఉన్న పెద్ద టివిలపై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు 31 జనవరి 2021 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వినియోగదారుల రిటైలర్ స్టోర్ లలో లభిస్తాయి.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా థియేటర్లలో సినిమాలు చూడటం ప్రమాదకరంగా ఉన్నందున మీరు మీ రూంలో, ఎంటర్టైన్మెంట్ రూం లేదా పెద్ద బెడ్ రూం కోసం కొత్త టీవీని కొనాలని చూస్తున్నట్లయితే, మీరు ఈ దక్షిణ కొరియా సంస్థ శామ్సంగ్ అందిస్తున్నా ఆఫర్లను చూడవచ్చు.
అంతేకాకుండా అదనంగా కొనుగోలుదారులకు 20 శాతం క్యాష్‌బ్యాక్, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా లభిస్తుంది. 1,990 రూపాయల నుండి ప్రారంభమయ్యే ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి.
రాబోయే కొద్ది వారాల పాటు కొనుగోలు చేసే వినియోగదారులకు 65-అంగుళాల క్యూఎల్‌ఇడి టివి, 75 అంగుళాల క్రిస్టల్ 4కె యుహెచ్‌డి టివిలతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎ51 స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది.
also read ఫేస్‌బుక్ యూసర్లకు షాకింగ్ న్యూస్.. లైక్ బటన్ తొలగింపు.. ...
55 అంగుళాల క్యూఎల్‌ఇడి టీవీలు, 65 అంగుళాల క్రిస్టల్ 4కె యుహెచ్‌డి టివిలను ఎంచుకునే కొనుగోలుదారుల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ఎ31 స్మార్ట్‌ఫోన్ ని కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు.
అదనంగా 75-అంగుళాల, 82-అంగుళాలు, 85-అంగుళాల క్యూఎల్‌ఇడి టీవీలను కొనుగోలు చేసే వారికి సౌండ్‌బార్ HW-Q800T లేదా HW-Q900T పొందవచ్చు. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ నుండి వస్తున్న ఈ క్యూఎల్‌ఇడి టివిలు 10 సంవత్సరాల స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ, ఒక సంవత్సరం సమగ్ర వారంటీ, ప్యానెల్‌పై ఒక సంవత్సరం అదనపు వారంటీతో వస్తున్నాయి.
"2020లో పెద్ద స్క్రీన్ 55-అంగుళాల స్మార్ట్ టీవీలకు అగ్ర నగరాలతో పాటు చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ పెరిగింది. అధిక-నాణ్యత ఓటిటి కంటెంట్, ఇంట్లో వినోదం కోసం వినియోగదారులు సినిమా వ్యూ అనుభవాన్ని అందించే పెద్ద టీవీలను కొనాలనుకుంటున్నారు.
‘బిగ్ టీవీ డేస్’ ప్రమోషన్ మేము నూతన సంవత్సరంలో వినియోగదారులకు ఆఫర్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది, ”అని శామ్సంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెజెంట్ రాజు పుల్లన్ అన్నారు.