లేటెస్ట్ ఫీచర్లతో త్వరలో పోకో ఎఫ్2 స్మార్ట్‌ ఫోన్‌ విడుదల.. ఈ ఏడాదిలో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదే..

By S Ashok Kumar  |  First Published Jan 2, 2021, 4:40 PM IST

గత ఏడాది 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్‌చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోయే మొదటి ఫోన్‌లలో పోకో ఎఫ్ 2 ఒకటి.


బీజింగ్ చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో ఈ ఏడాది 2021లో  పోకో ఎఫ్2ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.  గత ఏడాది 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్‌చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది.

ఈ ఏడాది కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోయే మొదటి ఫోన్‌లలో పోకో ఎఫ్ 2 ఒకటి. గత సంవత్సరం పది లక్షల  పోకో ఫోన్‌లను విక్రయించిన కంపెనీ పోకో సాధించిన విజయాన్ని, భారతదేశంలో ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల జాబితాలో కంపెనీ నాల్గవ స్థానంలో ఉంది.  

Latest Videos

undefined

also read మీ టీవీ స్క్రీన్ పై ఇలాంటి నంబర్ కనిపిస్తుందా..? నిర్లక్ష్యం చేయవద్దు, జాగ్రత్త! ...

పోకో ఇండియా 2020లో తన ప్రయాణాన్ని వివరించే వీడియోను ట్వీట్ చేసింది, ఇందులో పోకో ఎఫ్ 2 త్వరలో విడుదల కానున్నట్లు సూచించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి వివరాలు వెల్లడించకపోగా, ట్విట్టర్‌లో కొన్ని కీలక వివరాలను వెళ్లడయ్యాయి.

 పోకో ఎఫ్2  క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732జి ఎస్‌ఓ‌సి  సపోర్ట్ తో వస్తుందని, దీనికి 4,250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించినట్లు  ట్విటర్ ద్వారా తెలిసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలిపారు. పోకో ఎఫ్ 2లో అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఆశించవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ ఎన్‌ఎఫ్‌సితో వచ్చే అవకాశం ఉంది. ఈ స్పెసిఫికేషన్స్ అంచనాలతో చూస్తే పోకో F2 స్మార్ట్‌ ఫోన్‌ ధరలు రూ. 20,000-25,000 మధ్య ఉండవచ్చు. 

కొన్ని నివేదికల ప్రకారం పోకో భారతదేశంలో ల్యాప్‌టాప్‌లను కూడా విడుదల చేయనున్నాట్లు సమాచారం.  

click me!