భారతదేశంలో కొంతకాలంగా ఒప్పో రెనో 5ప్రో 5జి లాంచ్ గురించి పుకార్ల చక్కర్లు కొడుతున్నాయి, కానీ ఇప్పుడు కంపెనీ ఇండియాలో ఒప్పో రెనో 5ప్రో 5జి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఒప్పో రెనో సిరీస్ 5జి స్మార్ట్‌ఫోన్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న లేటెస్ట్ ఫోన్. భారతదేశంలో కొంతకాలంగా ఒప్పో రెనో 5ప్రో 5జి లాంచ్ గురించి పుకార్ల చక్కర్లు కొడుతున్నాయి, కానీ ఇప్పుడు కంపెనీ ఇండియాలో ఒప్పో రెనో 5ప్రో 5జి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
ఒప్పో రెనో 5 ప్రో 5జి జనవరి 18న మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల కానుంది. ఒప్పో రెనో 5ప్రో 5జి ఫుల్ డైమెన్షన్ ఫ్యూజన్ (ఎఫ్‌డిఎఫ్) పోర్ట్రెయిట్ వీడియో సిస్టమ్‌ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది.
దీనితో పాటు స్మార్ట్ అల్గోరిథంలకు కూడా సపోర్ట్ లభిస్తుంది, ఇది వీడియో రికార్డింగ్‌ను గొప్పగా చేస్తుంది. ఎఫ్‌డిఎఫ్ సహాయంతో మీరు గొప్ప పోర్ట్రెయిట్ వీడియోలను రికార్డ్ చేయగలరని ఒప్పో పేర్కొంది.
వీడియో రికార్డింగ్ కోసం ఏఐ రికార్డింగ్ ఒప్పో రెనో ప్రో 5జిలో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల మీరు స్పష్టమైన, ప్రకాశవంతమైన వీడియో అవుట్పుట్ పొందుతారు. ఒప్పో రెనో 5 ప్రో 5 జిలో అల్ట్రా నైట్ వీడియో, లైవ్ హెచ్‌డిఆర్ కూడా ఫీచర్స్ కూడా లభిస్తాయి. ఈ ఫోన్ వీడియో క్రియేటర్స్ కి ఒక బహుమతిగా ఉండబోతోందని చెప్పవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్ గురించి చెప్పాలంటే ఒప్పో రెనో 5 ప్రో 5 జి మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్‌తో భారతదేశంలో విడుదల కానున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ప్రాసెసర్ మల్టీమీడియా, వీడియోగ్రఫీ, 5జి, ఇమేజ్ ఇన్నోవేషన్ కోసం ఖచ్చితంగా సరిపోతుందని తెలిపింది. ఈ ప్రాసెసర్ 7nm ప్రాసెసర్‌లో రూపొందించారు.
also read
ఒప్పో రెనో 5 ప్రో 5జి ఫీచర్లు
ఒప్పో రెనో 5 ప్రో 5జి 6.55-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఓఎల్‌ఈడి డిస్ ప్లేతో 2,400 × 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ SoC తో పాటు 12జిబి LPDDR4x RAM, 256జిబి UFS 2.1 స్టోరేజ్ లభిస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్‌పై నడుస్తుంది. కనెక్టివిటీ ఫీచర్స్ లో 5జి, 4జి ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ 4,350 ఎంఏహెచ్ బ్యాటరీతో 65W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరాల విషయానికొస్తే ఒప్పో రెనో 5 ప్రో 5జి వెనుక భాగంలో 64ఎంపి ప్రాధమిక సెన్సార్ కెమెరా, 119-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో 8ఎంపి లెన్స్ కెమెరా, 2ఎంపి మాక్రో లెన్స్ కెమెరా, 2ఎంపి మోనో పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32 ఎంపీ స్నాపర్ కెమెరా ఉంది. 159.7 × 73.2 × 7.6 ఎంఎం సైజులో 173 గ్రాముల బరువు ఉంటుంది. చైనాలో ఒప్పో రెనో 5 ప్రో 5జి ధర 8జిబి / 128జిబి వేరియంట్‌కు ఆర్‌ఎంబి 3,399 (ఇండియాలో సుమారు రూ .38,300), 12జిబి / 256జిబి మోడల్‌కు ఆర్‌ఎంబి 3,799 (ఇండియాలో సుమారు రూ. 42,800).
Ready to experience the next best thing of the 5G world?
Get your hands on the fabulous and truly limitless with 5G connectivity, futuristic videography capabilities and other infinite features.
Know more: https://t.co/KiM3VMc41v pic.twitter.com/pPQ14lX0oL