కొత్త స్మార్ట్ ఫోన్​ కొంటే ఇక చార్జర్​ రాదు!

By Sandra Ashok Kumar  |  First Published Jul 9, 2020, 6:01 PM IST

తాజాగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఫోన్ బాక్సులో ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌లని విక్రయించడానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా శాంసంగ్​ తోపాటు యాపిల్​ సంస్ధ కూడా అడుగులేస్తున్నాయి.


న్యూఢిల్లీ: సాధరణంగా స్మార్ట్ ఫోన్ కి కొన్నపుడు చార్జర్ కూడా ఫోన్ బాక్స్ లో వస్తుంది. ఒకవేళ అది పాడైతే మరొకటి కొనుక్కుంటాం.అయితే తాజాగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఫోన్ బాక్సులో ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌లని విక్రయించడానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ దిశగా శాంసంగ్​ తోపాటు యాపిల్​ సంస్ధ కూడా అడుగులేస్తున్నాయి. ఛార్జర్‌ లేకుండా స్మార్ట్ ఫోన్స్ విక్రయించడం వల్ల దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ కి పెద్ద ఖర్చు తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని చైనా స్మార్ట్ మొబైల్స్​ ఫోన్ బాక్సుల్లో ఇయర్​ ఫోన్స్​ ఇవ్వడాన్ని నిలివేసింది. తాజాగా ఈ సంస్ధల కన్ను ఇప్పుడు చార్జర్లపై పడినట్లు తెలుస్తోంది.

Latest Videos

వచ్చే ఏడాది నుంచి వచ్చే కొన్ని ఫోన్ల బాక్సుల్లో చార్జర్లు లేకుండా పంపాలని శాంసంగ్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఛార్జర్ లేకుండా శామ్సంగ్ ఫోన్‌లను చిన్న బాక్సులో పంపిణీ చేయనుంది, అంటే దీని వల్ల కంపనీకి ఖర్చులు కూడా తగ్గనున్నాయి, ఫోన్ల ప్యాకేజింగ్​లో మార్పులు, రవాణాకు అయ్యే ఖర్చు, చార్జర్లను ఎక్కువగా తయారు చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే ఈ వేస్ట్ గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే శామ్సంగ్, ఆపిల్ సంస్థలు కూడా వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇరు కంపెనీలు ఈ నిర్ణయానికి వచ్చాయని తెలిసింది. ఫ్యూచర్ ఐఫోన్ మోడళ్లలో పవర్ ఎడాప్టర్లు, ఇయర్‌పాడ్స్‌ లేకుండా అందించడానికి  ఆపిల్ సంస్థ యోచిస్తోందని, కేవలం ఛార్జింగ్ కేబుల్‌తో స్మార్ట్ ఫోన్స్  సప్లయి చేస్తుందని కొన్ని నివేదికలు సూచించాయి.

also read ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్.. ...  

ప్రస్తుతం కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం డివైజెస్ బట్టి 18W పవర్ అడాప్టర్ లేదా 5W పవర్ అడాప్టర్‌తో ఐఫోన్‌లను రవాణా చేస్తుంది కానీ ఇప్పుడు ఐఫోన్ 12తో కస్టమర్ ఆపిల్ లేదా థర్డ్ పార్టీ సంస్థ నుండి విడిగా వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాపిల్​ ఐదు వాట్లు, 18 వాట్లు సామర్ధ్యం కలిగిన చార్జర్లను మొబైల్స్​తో పాటు అందజేస్తోంది.

వీటిని సాధ్యమైనంత త్వరగా నిలిపేసి, 20 వాట్ల సామర్ధ్యం కలిగిన ఒకే ఒక చార్జర్​ను మార్కెట్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.బాక్స్‌లో ఇయర్‌పాడ్స్, ఛార్జర్ లేకుండా ఐఫోన్ 12 ధర 50 డాలర్లు అధిక ధరతో  విక్రయించనున్నట్లు విశ్లేషకుడు చెప్పారు. ఇప్పటికే అన్ని ఫోన్లకు ఒకే రకమైన చార్జింగ్ మెకానిజమ్​ ఉండే దిశగా యూఎస్​బీ–సీ టైప్​ను యాపిల్​, శాంసంగ్​, గూగుల్​, మోటరోలా, సోనీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.

2021 నాటికి పూర్తి స్థాయిలో సీ టైప్​ చార్జింగ్ కలిగిన ఫోన్లను మాత్రమే ఈ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయి. ఫోన్లను కొనుగోలు చేస్తున్న వివియోగదారులే చార్జర్లకు అయ్యే ఖర్చులను కూడా భరించాలని టెక్​ కంపెనీలు భావిస్తున్నాయి. అంటే ఫోన్​తో పాటు చార్జర్​ను కూడా విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది.

చాలామంది యూజర్లు కొత్త ఫోన్లను కొన్నా తరువాత వారి వద్ద ఉన్న పాత చార్జర్లనే వాడుతుంటారు.  ఒకవేళ ఒరిజినల్ చార్జర్ పోతే థర్డ్ పార్టీ బ్రాండ్స్​  కంపెనీల చార్జర్లను కొనుగోలు చేసి వాడుతుంటారన్న సంగతి మీకు తెలిసిందే.

click me!