పబ్‌జీ మొబైల్ 0.12.0 అప్డేట్: కొత్త ఆయుధాలు, ఫీచర్లు ఇవే

By rajashekhar garrepally  |  First Published Apr 22, 2019, 2:28 PM IST

ప్లేయర్స్ అన్నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్ లేదా పబ్‌జీ(PUBG) 0.12.0ను ప్రారంభించింది. 0.12.0 కొత్త అప్డేట్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


ప్లేయర్స్ అన్నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్ లేదా పబ్‌జీ(PUBG) 0.12.0ను ప్రారంభించింది. 0.12.0 కొత్త అప్డేట్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అప్డేట్ పరిమాణం 475ఎంబీ ఉండగా, యాప్ స్టోర్ అప్డేట్ పరిమాణం ఇంకా వెల్లడించలేదు. అయితే ప్యాచ్ పరిమాణం 150ఎంపీ కంటే ఎక్కువ.

పిల్లలు, యువతలో బాగా ఆదరణ పొందిన బాటిల్ రాయల్ గేమ్ తాజా వర్షన్ ఇప్పుడు చాలా మెరుగుదలలను తీసుకొస్తోంది. న్యూ పబ్‌జీ మొబైల్ జాంబీస్ మోడ్‌ను ఇప్పుడు జాంబీగా పిలుస్తారు: డార్కెస్ట్ నైట్. ఈవోగ్రౌండ్‌తో ఈ ఈవెంట్ మోడ్ రిప్లేస్ చేయడం జరిగింది. ఓటీఏ అప్డేట్‌లో కూడా ఈ అప్డేట్ లభిస్తోంది. వైఫై నెట్‌వర్క్ డౌన్ లౌడ్ చేసుకోవడం మంచిది. 

Latest Videos

డార్కెస్ట్ నైట్: 

డార్కెస్ట్ నైట్ మోడ్‌లో పేయర్లు సోలో లేదా టీంతో కలిసి జాంబీస్పోరాడవచ్చు. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్లేయర్లు జోంబీస్‌తో పోరాడేందుకు బయటికి వెళ్లకూడదు. ఎందుకంటే రాత్రిల్లు గాలి విషయమమవుతుంది. 

స్పెక్టేటర్ మోడ్: 

స్పెక్టేటర్ మోడ్ అనేది గేమ్‌లో స్నేహితులను, ఇతర సిబ్బందిని, క్లాన్ మెంబర్స్‌ను స్పెక్టేట్ చేయడానికి కలుపుకోవచ్చు.  ప్లేయర్లు స్పెక్టేటర్ మోడ్ ప్రైవసీని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరులు కూడా స్పెక్టేట్ చేయాలనుకుంటే వారిని సెలెక్ట్ చేసుకోవాలి.

సర్వైవ్ టిల్ డాన్ 2: 

సర్వైవ్ టిల్ డాన్ 2.0లో కొన్ని జాంబీస్ కొద్దిపాటి ఎత్తు కలిగిన గోడలను ఎక్కగలుగుతాయి లేదా పైకప్పులను కూడా ఎక్కుతాయి. లేటెస్ట్ అప్డేట్ ద్వారా పబ్‌జీ మొబైల్‌లో జాంబీస్‌తో పోరాడటం మరింత ఆసక్తికరంగా ఉండనుంది. పబ్‌జీ మొబైల్ ఎక్స్ రెసిడెంట్ ఈవిల్ 2 కొలబారేషన్ ఇప్పుడు కొత్త ఆయుధాలు, కొత్త జాంబీస్‌తో వస్తోంది.

క్రోషయర్ మోడిఫికేషన్స్:

రెడ్ డాట్, హోలోగ్రాఫిక్, 2X స్కోప్, 3X స్కోప్స్‌ను విభిన్న రంగులలో అడ్జెస్టు చేసుకోవడం లాంటి కొత్త మార్పులను పబ్‌జీ మొబైల్ 0.12.0 తీసుకొచ్చింది. ప్లేయర్లు కూడా మల్టిపుల్ షేప్ వేరియేషన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.

న్యూ వెపన్స్:

జంగిల్ స్టైల్ మేగజైన్స్‌తోపాటు రాకెట్ లాంచర్ RPG-7ను ఇప్పుడు జత కలిపారు. ప్లేమ్‌త్రోయర్, M134లో మార్పులు చేశారు.

 

చదవండి: లేయర్‌తో జాగ్రత్త: శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2రోజులకే డ్యామేజ్!

click me!