చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి రియల్ మీ 6, రియల్ మీ 6ప్రో ఫోన్లను ఆవిష్కరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజాల్లో ఒక్కటైన రియల్ మీ తాజాగా భారత విపణిలోకి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చింది. గతంలో తీసుకు వచ్చిన రియల్ మీ 5, 5ప్రోకు కొనసాగింపుగా రియల్ మీ 6, రియల్ మీ 6ప్రో ఫోన్లను గురువారం విడుదల చేసింది.
ఈ రెండు ఫోన్లు కూడా ముందువైపు హోల్ పంచ్ కెమెరాలతో వస్తున్నాయి. రియల్ మీ 6 ఫోన్‌లో సింగిల్ పంచ్ హోల్ కెమెరా ఉండగా, రియల్ మీ 6 ప్రో ఫోన్‌లో డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాలు ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా ఇస్రో రూపొందించిన నావిక్ చిప్‌తో పని చేయనున్నాయి.
ఇక రియల్ మీ 6ప్రో మోడల్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో విపణిలోకి వస్తున్నది. 6జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.16,699, 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999, 8 జీబీ విత్ 128 జీబీ వేరియంట్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.18,999గా నిర్ణయించింది.
also read ఫేస్‌బుక్ ఉద్యోగికి కొరోనావైరస్... మరో 39 మందికి వ్యాధి లక్షణాలు....
లైటనింగ్ బ్లూ, లైటనింగ్ ఆరెంజ్ రంగుల్లో రియల్ మీ 6 ప్రో ఫోన్ లభ్యం కానున్నది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-రిటైలర్ ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ డాట్ కామ్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ విక్రయానికి రానున్నది. ఆఫ్ లైన్ లోనూ విక్రయిస్తారు. రియల్ మీ 6ప్రో ఫోన్ కొనుగోలుపై యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్ మీ 6 ఫోన్ కూడా మూడు వేరియంట్లలో వస్తున్నది. 4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.14,999, 8జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.15,999గా పేర్కొంది. బ్లూ, వైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ మార్చి 11వ తేదీ విక్రయానికి రానున్నది.
ఆండ్రాయిడ్ 10తోపాటు రియల్ మీ యూఐతో పని చేసే రియల్ మీ 6ప్రో ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లేతోపాటు 90హెచ్ జడ్ రీప్రెష్ రేట్‌తో వస్తోంది. దీనికి కార్నింగ్ గోరిల్లా 5 ప్రొటెక్షన్ అందిస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 720 జీ ప్రాసెసర్ వాడారు.
రియల్ మీ 6 ప్రోలో బ్యాకప్ 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ టెలీ ఫోన్ లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ అందిస్తున్నారు. సెల్పీల కోసం 16+8 ఎంపీ కెమెరాలను ఫ్రంట్ అందిస్తున్నది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్‌లో 4300 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 30డబ్ల్యూ వూక్ ఫ్లాస్ చార్జింగ్‌కు సపోర్ట్‌గా ఉంటుంది.
also read ఆన్ లైన్ చెల్లింపులలో కొత్త టెక్నాలజి...వేలి ఉంగరంతోనూ పేమెంట్స్....
ఆండ్రాయిడ్ 10 ప్లస్ రియల్ మీ యూఐ ఆధారంగానే రియల్ మీ 6 ఫోన్ కూడా పని చేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్, 90హెచ్ జడ్ ఆల్ట్రా స్మూత్ డిస్ ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్ గల ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉన్నాయి.
రియల్ మీ 6 ఫోన్‌లో ఇంకా ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ ఫీచర్ జత కలిసింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8+2+2 ఎంపీ సెన్సర్లు అమర్చారు. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 16 ఎంపీ కెమెరాను అందిస్తున్నారు. 4300 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ గల ఈ ఫోన్ 30వాట్ల ఫ్లాష్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.