ఒప్పో నుంచి కొత్త యాప్...10 లక్షల వరకు పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు...

Ashok Kumar   | Asianet News
Published : Mar 04, 2020, 10:25 AM IST
ఒప్పో నుంచి కొత్త యాప్...10 లక్షల వరకు పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు...

సారాంశం

 షియోమీ సంస్థ ఎంఐ క్రెడిట్‌ యాప్‌ను, రియల్‌ మి సంస్థ పేసా యాప్‌ను లాంచ్‌ చేసిన విషయం మీకు తెలిసిందే, అదే బాటలో ఇప్పుడు  ఒప్పో కంపెనీ క్యాష్‌ అనే పేరుతో ఒక కొత్త పర్సనల్‌ లోన్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారి ఒప్పో  కంపెనీ ఇప్పుడు ఒక కొత్త యాప్ లాంచ్ చేసింది. ఆ యాప్ పేరు ఏంటంటే క్యాష్‌ (Kash), ఇది పర్సనల్‌ లోన్‌ యాప్‌. అయితే ఇంతకు ముందు షియోమీ సంస్థ ఎంఐ క్రెడిట్‌ యాప్‌ను, రియల్‌ మి సంస్థ పేసా యాప్‌ను లాంచ్‌ చేసిన విషయం మీకు తెలిసిందే, అదే బాటలో ఇప్పుడు  ఒప్పో కంపెనీ క్యాష్‌ అనే పేరుతో ఒక కొత్త పర్సనల్‌ లోన్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది.

ఇందులో వినియోగదారులకు మ్యుచువల్‌ ఫండ్స్‌, పర్సనల్‌ లోన్స్‌, బిజినెస్‌ లోన్స్‌, మొబైల్‌ స్క్రీన్‌ ఇన్సూరెన్స్‌ తదితర సేవలు లభిస్తున్నాయి. ఒప్పో బ్రాండ్ లాంచ్ చేసిన ఈ క్యాష్‌ యాప్‌లో  ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను వాడుతున్న ఏ వినియోగదారుడైనా సరే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

also read వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్...మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు...

అందులో భాగంగానే పర్సనల్‌ లోన్స్‌ ఆప్షన్‌లో కనీసం రూ.8వేల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు పర్సనల్‌ లోన్ పొందవచ్చు. అలాగే రూ.1 లక్ష వరకు ఇన్‌స్టంట్‌ పర్సనల్‌ లోన్‌ లభిస్తుంది. ఇక రూ.50 వేల నుంచి రూ.10 కోట్ల వరకు బిజినెస్‌ లోన్స్‌ను ఈ యాప్‌లో అందిస్తున్నారు.

ఇక పర్సనల్‌ లోన్‌ను చెల్లించేందుకు కనీస కాలవ్యవధి 3 నెలలు కాగా గరిష్టంగా 60 నెలల లోపు తీసుకున్న మొత్తాన్ని చెల్లించవచ్చు. అలాగే బిజినెస్‌ లోన్స్‌ను 36 నెలల్లోగా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. 

also read ఆపిల్‌ ఐఫోన్ల ధరలు పెంపు...ఎందుకంటే ?

ఒప్పో క్యాష్‌ యాప్‌లో మ్యుచువల్‌ ఫండ్స్‌, ఎస్‌ఐపీలు తదితర సేవలను కూడా అందిస్తున్నారు. అలాగే వినియోగదారులు 3 వ్యక్తిగత ఉచిత కెడిట్‌ రిపోర్టులను పొందవచ్చు. ఇక పాత లేదా కొత్త స్మార్ట్‌ఫోన్లకు 2 క్లెయిమ్‌లతో కూడిన మొబైల్‌ స్క్రీన్‌ ఇన్సూరెన్స్‌ను ఈ యాప్‌లో అందిస్తున్నారు.

ప్రస్తుతం ఒప్పో క్యాష్‌ యాప్‌ బీటా వెర్షన్‌లో కేవలం ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంపై మాత్రమే వినియోగదారులకు లభిస్తున్నది. దీన్ని ఒప్పో ఫోన్‌ యూజర్లు యాప్‌ మార్కెట్‌లో, ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్ల యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే