ఒప్పో కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్...

By Sandra Ashok Kumar  |  First Published Mar 20, 2020, 6:05 PM IST

ఒప్పో ఎన్‌కో ఎం31 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు మార్చి 30 నుండి వాటి సేల్స్ ప్రారంభమవుతాయి అని కంపెనీ తెలిపింది.ఈ నెలలో ఆడియో సెగ్మెంట్ ను విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 


చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇటీవల భారతదేశంలో ఆడియో డివైజెస్ లో వాటి పాపులరిటీని పెంచుకుంటుంది. ఎన్‌కో ఫ్రీ,  ఎన్‌కో డబ్ల్యూ 31 ట్రు వైర్‌లెస్ అనే రెండు ఇయర్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.  

ఈ నెలలో ఆడియో సెగ్మెంట్ ను విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒప్పో ఎన్‌కో ఎం31 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు మార్చి 30 నుండి వాటి సేల్స్ ప్రారంభమవుతాయి అని కంపెనీ తెలిపింది.

Latest Videos

also read 31న విపణిలోకి షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌...

కొత్త ఇయర్‌ఫోన్‌ల ధరల గురించి సేల్స్ ప్రారంభం రోజున తెలుస్తుంది. ఇయర్‌ఫోన్‌లు బ్లాక్, గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.ఎన్‌కో క్యూ 31 తరువాత ఒప్పో నుండి వచ్చిన సెకండ్ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ హెడ్‌సెట్ ఇది.

కొత్త ఇయర్‌ఫోన్‌లు కనెక్టివిటీలో బ్లూటూత్ 5.0, లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఎల్‌డిఎసి బ్లూటూత్ కోడెక్‌కు సపోర్ట్ చేస్తాయి.హెడ్‌సెట్ 9.2 ఎం‌ఎం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి.  

also read హబ్ ద్వారా ఫేక్‌ వార్తల కట్టడి.. వాట్సాప్‌ నిర్ణయం


ఇయర్‌ఫోన్‌లు ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో లభిస్తాయని వీటి ధర సుమారు రూ. 5,000 ఉండొచ్చు అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ నెల ప్రారంభంలో ఒప్పో ఎన్‌కో ఫ్రీ, ఎన్‌కో డబ్ల్యూ 31 ట్రూ వైర్‌లెస్ అనే రెండు ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసింది.

click me!