షియోమీ తన సబ్ బ్రాండ్ ఎంఐలో ఎంఐ 10 మోడల్ 5జీ ఫోన్ ఈ నెల 31న భారత విపణిలోకి విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నది. దీని ధర రూ.42,400 ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ విపణిలోకి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నది. ఇండియాలో తన తొలి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్‌ను ఈ నెల 31వ తేదీన మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు షియోమీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు.
అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ అమెజాన్ ఆన్‌లైన్‌లో సేల్ ప్రారంభం కానున్నది.
also read హబ్ ద్వారా ఫేక్ వార్తల కట్టడి.. వాట్సాప్ నిర్ణయం
షియోమీ విడుదల చేస్తున్న ఎం 10 మోడల్ ఫోన్.. చైనాకే చెందిన వన్ ప్లస్ 8 ప్రో, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 మోడల్ ఫోన్లు కూడా ఒకే ధరకు లభించనున్నాయి. వీటి మూడింటిలోనూ దాదాపుగా ఇవే ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు.
12 జీబీ ర్యామ్ విత్ 512 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ విత్ 256 స్టోరేజ్ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ఫోన్ ధర రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని అంచనా.
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్ బ్యాక్, డెబిట్ కార్డ్ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగదారులకు లభించనుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.
also read అమెరికాలో ఇళ్లకే ప్రజలు పరిమితం ఆపిల్ స్టోర్ల నిరవధిక మూత
ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అలాగే క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్, 865 సాక్‌ప్రాసెసర్ కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ 10 సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ లభిస్తుంది.
ఇంకా 8జీబీ ర్యామ్ విత్ 128 స్టోరేజ్ సామర్థ్యం దీని సొంతం. ఇక 20 ఎంపీ సెల్పీ కెమెరాతోపాటు 108+13+ 2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమరా ఉంటాయి. ఇందులో 4780 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.