ట్రిపుల్ రేర్ కెమెరాలతో వన్ ప్లస్: మే 14న విపణిలోకి

By rajashekhar garrepallyFirst Published Apr 16, 2019, 9:45 AM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ 7 సిరీస్‌లో మూడు వేర్వేరు ఫోన్లను ఒకేసారి వచ్చేనెల 14న విపణిలోకి విడుదల చేయనున్నది. వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7 ప్రో 5జీ ఫోన్లను ఆవిష్కరిస్తున్నది. 

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్’ ప్లస్ మోడల్ 7 సిరీస్‌ ఫోన్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ సంగతి సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టడంతో బయటపడింది. 

ఆసుస్ జెన్ ఫోన్6 మోడల్ స్మార్ ఫోన్ ఆవిష్కరణకు రెండు రోజులు ముందుగా వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్లు విపణిలోకి అడుగు పెట్టనున్నాయి. అధికారికంగా వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. 

అయితే ఒకేసారి ‘7’ సిరీస్ వన్ ప్లస్ ఫోన్లను గ్లోబల్ లాంచ్‌గా ఆవిష్కరించాలని సంస్థ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. వన్ ప్లస్ 7 వేరియంట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ ప్లేతో బేస్ మోడల్ 6జీ ర్యామ్ కెపాసిటీతో అందుబాటులోకి రానున్నది. స్నాప్ డ్రాన్ 855 ప్రాసెసర్, ఎక్కువ కాలం చార్జింగ్ కాపాడే 4000 ఎంఎహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 9 పై, ఆక్సిజెనోస్ కలిగి ఉంటుంది. 

వన్ ప్లస్ 6 ప్రో ఫోన్ 6.67 అంగుళాల సూపర్ ఆప్టిక్ డిస్ ప్లే, 855 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 8జీబీ రాం ప్లస్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ (48 మెగా పిక్సెల్ సెన్సర్, 16 మెగా పిక్సెల్ సెన్సర్, 8 మెగా పిక్సెల్ సెన్సర్) కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 

వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7 ప్రో 5జీలకు వేర్వేరు మోడల్ నంబర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ 7 ఫోన్‌కు జీఎం1901, జీఎం1903, జీఎం1905.. వన్ ప్లస్ 7 ప్రో ఫోన్‌కు జీఎం1911, జీఎం1913, జీఎం1915, జీఎం1917... వన్ ప్లస్ 7 ప్రో 5జీ ఫోన్‌కు జీఎం1920 నంబర్‌తో సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. 

click me!