ఇండియాలో ధర తగ్గిన నోకియా 7.1: ఎంతో తెలుసా?

By rajashekhar garrepally  |  First Published Apr 15, 2019, 6:10 PM IST

హెచ్ఎండీ నుంచి భారతదేశంలో 2018లో విడుదలైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 7.1 ధర ఇప్పుడు కొంత తగ్గింది. 19,999 ధరతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారీగా నమోదు చేసింది.


ముంబై: హెచ్ఎండీ నుంచి భారతదేశంలో 2018లో విడుదలైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 7.1 ధర ఇప్పుడు కొంత తగ్గింది. 19,999 ధరతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారీగా నమోదు చేసింది.

ఇప్పుడిది ఆండ్రాయిడ్ 9పైతో అప్‌డేట్ కూడా అవుతోంది. అంతేగాక, ఇప్పుడు ధర కూడా తగ్గడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మరోసారి ఈ ఫోన్ వైపు చూస్తున్నారు. 19,999 ధరతో మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్ ధర ఇప్పుడు రూ. 2000 తగ్గింది. దీంతో ఈ ఫోన్ 17,999కే లభిస్తోంది.

Latest Videos

కాగా, ముంబైకి చెందిన స్మార్ట్‌ఫోన్ రిటైలర్ మహేష్ టెలికం.. నోకియా 7.1 ఫోన్‌పై మరింత తగ్గించి రూ. 16,999 అందిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇతర విషయాలు ఏమి చెప్పలేదు ఈ ఆఫ్‌లైన్ రిటైలర్. 

నోకియా 7.1 స్పెసిఫికేషన్స్

5.84 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే( వైబ్రంట్ కలర్స్ ప్యూడ్ డిస్‌ప్లే టెక్నాలజీ), ఎఫ్‌హెచ్‌డీ+2280x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, యాస్పెక్ట్ రేషియో 19:9. 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ/64జీబీ స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్ 636ఎస్ఓఎస్ కలిగివుంది. 

400జీబీ వరకు అదనపు స్టోరేజీ స్పేస్ కోసం మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఆడ్రాయిడ్ పైకి అప్‌డేట్ అయ్యింది. 12ఎంపీ+5ఎంపీతో రేర్ కెమెరా కలిగివుంది. సెల్ఫీ కెమెరా 8ఎంపీ సెన్సార్ f/2.2. బోథీస్, 3డీ పర్సోనాస్ ఫీచర్లను ఈ కెమెరాలు కలిగివున్నాయి. బ్యాటర్ పవర్ 3060ఎంఏహెచ్ కలిగివుంది.

click me!