రూ.10,000ల్లోపు 5బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..

By rajashekhar garrepally  |  First Published Apr 15, 2019, 4:10 PM IST

మనదేశంలో రూ.10,000లోపు ధరలో చాలా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రం మంచి కెమెరా క్లారిటీని కలిగివున్నాయి. పలు మొబైల్ తయారీ సంస్థలు అందిస్తున్న రూ. 10వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


మనదేశంలో రూ.10,000లోపు ధరలో చాలా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రం మంచి కెమెరా క్లారిటీని కలిగివున్నాయి. పలు మొబైల్ తయారీ సంస్థలు అందిస్తున్న రూ. 10వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Realme 3

Latest Videos

అందుబాటు ధరలో లభిస్తున్న రియల్‌మీ 3కి వెనుకవైపు (13ఎంపీ+2ఎంపీ) డ్యూయెల్ కెమెరాలు ఉండటం విశేషం. బయటికి వెళ్లినప్పుడు తీసుకునే ఫొటోలు మంచి క్లారిటీతో వస్తాయి. వెలుతురు సరిగా లేని పరిస్థితుల్లోనూ కెమెరా బాగా పనిచేస్తోంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 13ఎంపీ ఉంది. మంచి సెల్ఫీలు తీసుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

డిస్‌ప్లే: 6.22 ఇంచ్
ప్రాసెసర్: ఆక్టాకోర్
ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సెల్
బ్యాక్ కెమెరా: 13ఎంపీ+2ఎంపీ
ర్యామ్: 3జీబీ
ఓస్: ఆండ్రాయిడ్
స్టోరేజీ: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4230ఎంఏహెచ్


Redmi Note 7

రెడ్‌మీ నోట్ 7 ప్రో తోపాటు రెడ్‌మీ నోట్ 7 కూడా విడుదలైంది. రియల్‌మీ 3 లాగే రెడ్‌మీ నోట్ 7 ఫోన్ కూడా వెనుకవైపు డ్యూయెల్ కెమెరాలను కలిగివుంది. 12ఎంపీ+2ఎంపీ, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, హెచ్‌డీఆర్ కలిగివుంది. ఫ్రంట్ కెమెరా 13ఎంపీ సెన్సార్ కలిగివుండటంతో మంచి క్లారిటీతో సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంది.

డిస్‌ప్లే: 6.22 ఇంచ్
ప్రాసెసర్: ఆక్టాకోర్
ఫ్రంట్ కెమెరా: 13 ఎంపీ
బ్యాక్ కెమెరా: 12ఎంపీ+2ఎంపీ
ర్యామ్: 3జీబీ
ఓస్: ఆండ్రాయిడ్
స్టోరేజీ: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4230ఎంఏహెచ్


Nokia 5.1 Plus

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 5.1 ప్లస్‌ను గత సంవత్సరం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది మంచి డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు మంచి క్వాలిటీని కలిగివున్నాయి. డ్యూయెల్ బ్యాక్ కెమెరాలు 13ఎంపీ, 5ఎంపీ సెన్సార్లతో కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీ కెమెరా 8 ఎంపీ సెన్సార్ ఉంది. మంచి లైటింగ్ ఉంటే వివిడ్, డిటేల్డ్ చిత్రాలు తీయడంలో రేర్ కెమెరాలు బాగా పనిచేస్తాయి. అయితే కాంతి తక్కువ ఉన్న పరిస్థితుల్లో మాత్రం కెమెరా క్వాలిటీ చెప్పుకోదగిన విధంగా లేదు. లైటింగ్ బాగుంటే మాత్రం ఫొటోలు బాగా తీసుకోవచ్చు.

డిస్‌ప్లే: 5.86 ఇంచ్
ప్రాసెసర్: ఆక్టా కోర్
ఫ్రంట్ కెమెరా: 8ఎంపీ
బ్యాక్ కెమెరా: 13ఎంపీ+5ఎంపీ
ర్యామ్: 3జీబీ
ఓఎస్: ఆండ్రాయిడ్
స్టోరేజి: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3060ఎంఏహెచ్

Moto G6

మిగితా ఫోన్లలాగే మోటో జీ6 కూడా డ్యూయెల్ బ్యాక్ కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కలిగివుంది. ఫోన్ వెనుకవైపు 12ఎంపీ, 5ఎంపీ సెన్సార్‌లతో కెమెరా పనిచేస్తుంది. కాంతి కొంత తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఫొటో క్లారిటీ బాగుంది. ఇక సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. 16ఎంపీ సెన్సార్‌తో సెల్ఫీల క్వారిటీ చాలా బాగుంటుంది. 

డిస్‌ప్లే: 5.7ఇంచ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 450
ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
బ్యాక్ కెమెరా: 12ఎంపీ+5ఎంపీ
ర్యామ్: 3జీబీ
ఓఎస్: ఆండ్రాయిడ్
స్టోరేజీ: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3000 ఎంఏహెచ్


LG Q6

ఎల్‌జీ క్యూ6 అనేది ఇప్పుడు చెప్పుకున్న ఫోన్లంటిలోకి ఇది పాతది. అందుకే బ్యాక్ సైడ్ ఒకే కెమెరాను కలిగివుంది. బ్యాక్ కెమెరా 13ఎంపీ ఉండగా, ఫ్రంట్ కెమెరా 5ఎంపీ సెన్సార్ సెటప్ ఉంది. అయితే, ఈ ఫోన్ కెమెరాతో తీసే ఫొటోలు మంచి క్వాలిటీ, క్వారిటీతో వస్తాయి. వెలుతురు పరిస్థితులు దీని కెమెరా పనితనంపై ప్రభావం చూపుతాయి. 

డిస్‌ప్లే: 5.5ఇంచ్
ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 450
ఫ్రంట్ కెమెరా: 5ఎంపీ
బ్యాక్ కెమెరా 12 ఎంపీ
ర్యామ్: 3జీబీ
ఓఎస్: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 3000ఎంఏహెచ్

click me!