నేటి నుంచే హువాయ్ పీ30 లైట్ అమ్మకాలు: ధర, ప్రత్యేక ఫీచర్లు

By rajashekhar garrepally  |  First Published Apr 25, 2019, 5:38 PM IST

హువాయ్ కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ ఇండియా ఇటీవల ప్రకటించిన విధంగా హువాయ్ పీ30 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను amazon.inలో గురువారం(ఏప్రిల్ 25) నుంచి అందుబాటులో ఉంచింది. అయితే 4జీబీ ర్యామ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 


హువాయ్ కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ ఇండియా ఇటీవల ప్రకటించిన విధంగా హువాయ్ పీ30 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను amazon.inలో గురువారం(ఏప్రిల్ 25) నుంచి అందుబాటులో ఉంచింది. అయితే 4జీబీ ర్యామ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 

4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 19,900గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 22,990. ఈ రెండు ఫోన్లు కూడా మిడ్‌నైట్ బ్లాక్, పీకాక్ బ్లూ కలర్లలో లభిస్తున్నాయి. హువాయ్ పీ30 ప్రో తోపాటు హువాయ్ పీ30 లైట్ కూడా ఇటీవల భారతదేశ మార్కెట్లో విడుదలైంది.

Latest Videos

ఈ స్మార్ట్‌ఫోన్‌పై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. ఎక్చేంజీలో రూ.2000 వరకు తగ్గింపు వస్తోంది. 2.2టెరాబైట్స్ డేటా, రూ. 2200 క్యాష్‌బ్యాక్(రూ. 50 విలువైన 44 వోచర్స్, ఒక్కోటి రూ.198/299ప్లాన్). ఈ క్యాష్ బ్యాక్ ఓచర్లు ఒక్కసారి రెడీమ్డ్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లోని రీఛార్జ్ చేసుకోవాలి.
రూ. 198/299 రీఛార్జ్‌తో 5జీబీ అడిషనల్ డేటా వోచర్, లిమిటెడ్ 25రీఛార్జీలు మైజియో ఖాతాకు క్రెడిట్ చేయబడతాయి.

పీ 30 లైట్ వెనుకవైపు మూడు కెమెరాలున్నాయి. ట్రిపుల్ ఏఐతో 24ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, F/1.8అపార్చర్, వైడ్ యాంగిల్(120డిగ్రీ) అమాల్మేటెడ్ సైనిక్ రికగ్నిషన్, 8ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, f/2.4 అపార్చర్, 2ఎంపీ డెప్త్ సెన్సింగ్ లెన్స్, ఇక ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ, f/2.0అపార్చర్. సెల్ఫీ కెమెరా ఏ వెలుతురు తక్కువ ఉన్నా కూడా ఫొటోలు బాగా తీయగలదు. 

కాగా, వెనుకవైపు కెమెరాలో అదనపు ఫీచర్లు చాలా ఉన్నాయి. వైడ్ యాంగిల్ లెన్స్, నైట్, పొట్రెయిట్, ప్రో, స్లో-మో, పనోరమా, లైట్ పెయింటింగ్, హెచ్‌డీఆర్, టైమ్ ల్యాప్స్, 3డీ పనోరమా, స్టిక్కర్స్, డాక్యుమెంట్స్, అల్ట్రా స్నాప్‌షాట్, క్యాప్చర్ స్మైల్స్, ఆడియో కంట్రోల్, టైమర్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే పొట్రెయిట్, పనోరమ, ఏఆర్ లెన్స్, టైమ్-ల్యాప్స్, ఫిల్టర్, 3డీ పనోరమా, స్టిక్కర్స్, క్యాప్చర్ స్మైల్స్, మిర్రర్ రిఫ్లెక్షన్, ఆడియో కంట్రోల్, టైమర్.

 పీ30 లైట్‌కి 6.15 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్, ఎఫ్‌హెచ్‌డీ 2312x1080 పిక్సెల్ రిజల్యూషన్, టాప్‌లో టియర్‌డ్రాప్ నాచ్ . ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ ఫోన్ అత్యంత సామర్థ్యం కలిగిన కిరిన్ 710 ప్రాసెసర్ కలిగివుంది.

చదవండి: మార్కెట్లో ప్రవేశపెట్టని ఫోన్ పొగొట్టుకున్న హానర్: తిరిగిస్తే భారీ నజరానా

click me!