ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘సూపర్ వాల్యూ వీక్’ పేరిట పలు స్మార్ట్‌ఫోన్ల భారీ తగ్గింపులను ప్రకటించింది. ముఖ్యంగా హానర్ కంపెనీకి చెందిన 10ఫోన్లపై తగ్గింపు ధరను అందిస్తోంది. ఇతర ఫోన్లపై కూడా డిస్కౌంట్ ఇస్తోంది.
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘సూపర్ వాల్యూ వీక్’ పేరిట పలు స్మార్ట్‌ఫోన్ల భారీ తగ్గింపులను ప్రకటించింది. ముఖ్యంగా హానర్ కంపెనీకి చెందిన 10ఫోన్లపై తగ్గింపు ధరను అందిస్తోంది. ఇతర ఫోన్లపై కూడా డిస్కౌంట్ ఇస్తోంది.
రూ.99కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను అందిస్తోంది. కాగా, ఈ సేల్ ఏప్రిల్ 23-29 వరకు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్‌లో కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు పరిశీలించినట్లయితే..
హానర్ 10 లైట్:
3జీబీ ర్యామ్ గల ఈ ఫోన్ అసలు ధర రూ.13.999 కాగా, ఈ వీక్ ఆఫర్లో రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ. 11,999కే లభిస్తోంది.
ఇక 4జీబీ ర్యామ్ గల ఈ ఫోన్ వేరియెంట్ ధర రూ. 16,999 కాగా.. డిస్కౌంట్ రూ.3వేలు అందిస్తోంది. దీంతో ఇది రూ.13,999కే లభిస్తోంది.
హానర్ 10లైట్ ఫీచర్లు: 6.21 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340x1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 256 జీబీకి విస్తరించుకోగల స్టోరేజీ, ఆండ్రాయిడ్ 9పై, హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, 13, 2 మెగా పిక్సెల్ డ్యూయెల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.
హానర్ 9 లైట్:
హానర్ 9 లైట్( 3జీబీ) అసలు ధర రూ. 13,999 కాగా, డిస్కౌంట్ రూ. 5,500. దీంతో ఈ ఫోన్ రూ. 8,499కే లభిస్తోంది.
ఇక 4జీబీ ర్యామ్ గల ఈ ఫోన్ వేరియెంట్ ధర రూ. 16,999 ఉండగా. రూ. 7వేలు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ. 9,999కే అందుబాటులోకి వచ్చింది.
హానర్ 9 లైట్ పీచర్లు:
5.65 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160x1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజీ, 256 జీబీకి విస్తరించుకోగల స్టోరేజీ, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13, 2 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 ఎంపీ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.
హానర్ 9ఎన్
4జీబీ ర్యామ్ గల ఈ ఫోన్ అసలు రూ. 15,999 కాగా, రూ. 6వేలు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో రూ. 9,999కే ఈ ఫోన్ లభిస్తోంది.
5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080x2280 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజీ, 256 జీబీకి విస్తరించుకునే అవకాశం. ఆండ్రాయిండ్ 8.0 ఓరియో, 13, 2 ఎంపీ డ్యూయెల్ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.
హానర్ 7ఎ:
3జీబీ ర్యామ్ గల ఈ ఫోన్ అసలు ధర రూ. 10,999 కాగా, దీనిపై డిస్కౌంట్ రూ.3,500 డిస్కౌంట్ లభస్తోంది. దీంతో రూ. 7,499కి ఈ ఫోన్ లభిస్తోంది.
హానర్ 7ఎ ఫీచర్లు:
5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440x720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ, 256జీబీకి విస్తరించుకునే అవకాశం. ఆండ్రాయిండ్ 8.0 ఓరియో, 13, 2 ఎంపీ డ్యూయెల్ కెమెరాలు, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, పింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
హానర్ 7ఎస్
2జీబీ ర్యామ్ గల ఈ ఫోన్ అసలు ధర రూ. 8,999 కాగా.. దీనిపై రూ. 3వేలు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో రూ. 5,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
హానర్ 7ఎస్ ఫీచర్లు:
5.45 అంగుళాల డిస్‌ప్లే, 1440x720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగా హెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ, 128 జీబీకి విస్తరించుకునే అవకాశం. ఆండ్రాయిడ్ 8.1ఓరియో, డ్యూయెల్ సిమ్, బ్యాక్ కెమెరా 13 ఎంపీ, సెల్ఫీ కెమెరా 5ఎంపీ, బ్యాటరీ పవర్ 3020ఎంఏహెచ్.
ఇక రెడ్‌మీ నోట్ 6 ప్రో(4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ) డిస్కౌంట్ తర్వాత ధర రూ.11,999 ఉంది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 ధర రూ. 36,990 ఉండగా, శామ్సంగ్ గెలాక్సీ ఎస్8 ధర రూ. 30,990గా ఉంది.