ఐదు కెమెరాలతో హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్....

By Sandra Ashok KumarFirst Published Dec 28, 2019, 11:11 AM IST
Highlights

హువావే పి 40 ప్రో 6.5-అంగుళాల నుండి 6.7-అంగుళాల  స్క్రీన్ తో లాంచ్ చేయబోతుంది అని తెలుస్తుంది.ఇటీవల లీక్ అయిన పి 40 ప్రో స్మార్ట్ ఫోన్ కు వెనుకవైపు ఐదు కెమెరాలతో రావచ్చని లీక్ అయిన ఫోటోలో తెలుస్తుంది.
 

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే కంపెనీ రాబోయే రోజుల్లో  పి 40, పి 40 ప్రో స్మార్ట్‌ఫోన్లను మార్చి 2020లో లాంచ్ చేయాలని చూస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇటీవల లీక్ అయిన పి 40 ప్రో స్మార్ట్ ఫోన్ కు వెనుకవైపు ఐదు కెమెరాలతో రావచ్చని లీక్ అయిన ఫోటోలో తెలుస్తుంది.

దాని బ్యాక్ కెమెరాలో ఉన్న ఐదు స్నాపర్లలో 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 మెయిన్ సెన్సార్, 20 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో (10x ఆప్టికల్ జూమ్), మైక్రో కెమెరా, 3 డి టోఫ్ యూనిట్ కలిగి ఉంటుందని గురువారం ఒక నివేదిక తెలిపింది.

also read  ఇండియాలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో తెలుసా....?

పి 40 ప్రో 6.5-అంగుళాల నుండి 6.7-అంగుళాల స్క్రీన్ సైజ్ తో వస్తుందని పుకార్లు కూడా ఉన్నాయి. వెనుక ప్యానెల్ వద్ద కెమెరా మాడ్యూళ్ళను కలిగి ఉంటుందని ఇంకా ఇది P40 ప్రోని బ్లూ కలర్‌లో వస్తుందని లీక్ అయిన సమాచారం ద్వారా తెలిసింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ పై లీకైన సమాచారం ఏంటంటే ప్యానెల్ నాచ్ లెస్ డిస్ప్లేని కలిగి ఉంటుందని, సెల్ఫీ కెమెరా పాప్-అప్ ద్వారా ఉంటుందా లేదా అండర్ డిస్‌ప్లే ఉంటుందా అనేది స్పష్టంగా తెలియదు అని ఒక నివేదిక తెలిపింది. 

మరో నివేదిక ప్రకారం మింగ్-చి కుయో హువావే పి 40 ప్రో 10x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుందని చెప్పారు. హువావే పి 40 సిరీస్ ధర సిఎన్‌వై 4,000 నుండి సిఎన్‌వై 5,000 మధ్య (సుమారు రూ .40,500 నుంచి రూ .50,700) ప్రారంభమవుతుందని చెప్పారు. పి 40 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు గూగుల్ ఆండ్రాయిడ్‌కు బదులుగా దాని స్వంత హార్మొనీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ తో రవొచ్చు అని హువావే వినియోగదారుల బిజినెస్ లీడర్ రిచర్డ్ యు అన్నారు.

also read ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో మార్పు....

హార్మోని ఓఎస్ ఇప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం సిద్ధంగా ఉందని ఇందుకోసం కంపెనీ వేచి చూస్తుందని ఆయన అన్నారు.అంతేకాకుండా హువావే  కిరిన్ ప్రాసెసర్లను కంపెనీలోని ఇతర సంస్థలకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), రోబోటిక్స్ వంటి విభాగాల కోసం విక్రయించడానికి పరిశీలిస్తున్నట్లు రిచర్డ్ యు వెల్లడించారు. సంస్థ ఇంతకుముందు కొత్త కిరిన్ 990 (5 జి) ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఇంటిగ్రేటెడ్ 5జి మోడెమ్‌తో IFA 2019 లో విడుదల చేసింది.

click me!