ఒప్పో కంపెనీ ఎన్కో ఫ్రీ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ట్యాప్ మరియు స్లైడ్ కంట్రోల్ బటన్స్ తో వస్తుంది.ఇప్పుడు ఒప్పో ఎన్కో ఫ్రీ ఇయర్‌ఫోన్‌ల ఫీచర్స్, ధర మరియు లభ్యతపై మరిన్ని వివరాలను వెల్లడించింది.
ఒప్పో కంపెనీ ఇప్పుడు ‘ఎంకో ఫ్రీ’ ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఒప్పో బ్రాండ్ మొదట ఈ నెల ప్రారంభంలో ఇన్నో డే 2019 సమావేశంలో ఇయర్ బడ్స్ లూక్స్ ని రిలీస్ చేసింది. అయితే, ఇప్పుడు ఒప్పో ఎన్కో ఫ్రీ ఇయర్‌ఫోన్‌ల ఫీచర్స్, ధర మరియు లభ్యతపై మరిన్ని వివరాలను వెల్లడించింది.
also read ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసా...?
ఫస్ట్ లుక్‌లో ఒప్పో ఎన్కో ఫ్రీ ఇయర్‌ఫోన్‌లు ఆపిల్ ఎయిర్‌పాడ్స్ లాగా కనిపిస్తాయి. ఒప్పో సబ్-బ్రాండ్ రియల్ మీ ఇటీవల రియల్ మీ బడ్స్ ఎయిర్‌ను విడుదల చేసింది. ఇది ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను పూర్తిగా క్లోన్ చేస్తుంది. ఏదేమైనా, ఎన్‌కో ఫ్రీ ఇయర్‌ఫోన్‌లు దాని స్లీవ్‌లు పైన కొన్ని స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది.
ఒప్పో ఎన్కో ఫ్రీ ఇయర్ ఫోన్స్ డిజైన్
ఒప్పో ఇయర్‌బడ్స్ రెండు ఇప్పుడు గ్లో డిజైన్ తో ఇంకా వాటిపై స్లైడ్ కంట్రోల్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్లను ఇయర్ బడ్స్ మీద మీ వేలుతో టచ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. లెఫ్ట్ ఇయర్ బడ్ పై వాల్యూమ్ కంట్రోల్, రైట్ ఇయర్ బడ్ పైన మ్యూజిక్ ట్రాక్‌లను మార్చడానికి కంట్రోల్ చేస్తుంది. మీరు ఇంకా స్టాండర్డ్ ట్యాప్ కంట్రోల్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇంకా, మీరు మరింత సురక్షితమైన ఫిట్ కోసం సిలికాన్ టిప్స్ ఉపయోగించుకోవచ్చు.
also read ఆర్‌బిఐ నుండి కొత్త ప్రీపెయిడ్ పేమెంట్ .....10వేల వరకు ....
ఒప్పో ఎన్‌కో ఇయర్‌బడ్స్‌లో 13.4 మిమీ డైనమిక్ డ్రైవర్లు ఉంటాయి. ఇయర్‌ఫోన్‌లు డ్యూయల్-మైక్రోఫోన్ బీమ్-ఫార్మింగ్ టెక్నాలజీ ఇంకా ఏఐ సౌండ్ క్యాంసెల్ సపోర్ట్ చేస్తుంది. ఒప్పో ఎన్కో ఫ్రీ ఇయర్ బడ్స్ కేసు కూడా కొద్దిగా కొత్తగా కనిపిస్తుంది, బ్రాండింగ్ అలాగే ఎల్‌ఈడి లైట్ ఉంటుంది. ఇయర్‌బడ్స్ పైన రీసెట్ బటన్, కనెక్ట్ చేసుకోవడానికి బటన్స్ కూడా ఉంటాయి.
ఒప్పో ఎన్కో ఫ్రీ ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను చైనాలో CNY 699 (సుమారు రూ .7,100)ధరకు కొనుగోలు అందుబాటులో ఉంది. అవి వైట్, రోజ్, బ్లాక్ మూడు కలర్లో లభిస్తాయి. ఇయర్‌బడ్‌లు డిసెంబర్ 31 నుండి చైనాలో లభిస్తాయి. భారతదేశంలో వీటిని లాంచ్ చేయడానికి మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.