సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది శుభవార్తే. ఎందుకంటే. గూగుల్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు తాజాగా విడుదలయ్యాయి. పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ మోడల్స్‌ని అధికారికంగా విడుదల చేసింది.
సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది శుభవార్తే. ఎందుకంటే. గూగుల్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు తాజాగా విడుదలయ్యాయి. పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ మోడల్స్‌ని అధికారికంగా విడుదల చేసింది. వీటి ధర భారత మార్కెట్లో రూ. 39,9999 ఉండే అవకాశం ఉంది.
త్వరలో(మే 15 నుంచి)నే సేల్స్ కూడా ప్రారంభించనుంది. గూగుల్ I/O 2019 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసింది. గతంలో గూగుల్ రిలీజ్ చేసిన ఫోన్లతో పోలిస్తే వీటి ధర తక్కువనే చెప్పాలి.
గూగుల్ పిక్సెల్ 3, 3ఎక్స్ఎల్ మొబైళ్లను గత అక్టోబర్‌లో రూ. 71,000-92,000 ధరతో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుత వీటి ధర రూ. 57,000-44,999 మధ్య ఉంది. అడ్వాన్స్‌డ్ హెచ్‌డీఆర్+, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ కలయికతో పిక్సెల్ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.
పిక్సెల్ 3ఏ ఫీచర్స్:
5.6 అంగుళాల డిస్‌ప్లే
4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
12.2ఎంపీ రియర్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ
పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్ ధర: రూ. 44,999
6 అంగుళాల డిస్ ప్లే
3,700 ఎంఏహెచ్ బ్యాటరీ.
పిక్సెల్ 3ఏ, పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్ ఫోన్లు ఇప్పుడు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సిమ్ కార్డులను సపోర్ట్ చేస్తున్నాయి. అప్ కమింగ్ వర్షన్‌లో.. ఆపరేషన్ సిస్టమ్ ఆండ్రాయిడ్ క్యూ, లైవ్ క్యాప్షన్ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
మరిన్ని వార్తలు చదవండి:
భారత మార్కెట్లోకి నోకియా 4.2: ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్లు..
14న ఎంట్రీ: వన్‌ప్లస్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ ఇవే!
Vivo S1 Pro విడుదల: పాప్-అప్, ట్రిపుల్ కెమెరా హైలట్, ఫీచర్లివే..