ధరల విషయంలో మధ్యస్థంగా ఉండి, మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, కెమెరా క్లారిటీ బాగుండే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ధరల విషయంలో మధ్యస్థంగా ఉండి, మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, కెమెరా క్లారిటీ బాగుండే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
రూ. 15,000ల్లోపు ధరతోనే మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లను ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. రూ. 10,000 ధరల విభాగంలో కంటే రూ. 15,000 ధరల విభాగంలో వినియోగదారుడి అంచనాలకు తగిన ఫోన్లు లభిస్తున్నాయి. రూ. 15,000ల ధరల విభాగంలో లభించే మంచి కెమెరా ఫోన్లను పరిశీలించినట్లయితే..
రెడ్‌మీ నోట్ 7 ప్రో(Redmi Note 7 Pro)
రెడ్‌మీ నోట్ 7 ప్రోను జియోమీ సంస్థ తొలిసారిగా భారత మార్కెట్లోనే ప్రవేశపెడుతుండటం గమనార్హం. చైనాలోనే ఈ మొబైల్ కొంత ఆలస్యంగా విడుదల కానుంది.
ఈ ఫోన్ 48ఎంపీ ప్రధాన కెమెరా(సోనీ ఐఎంఎక్స్ 586సెన్సార్, ఎఫ్/1.79అపర్చర్), 1.6 మైక్రాన్ పిక్సెల్స్ సైజ్.
5మెగాపిక్సెల్ డెప్ట్ సెన్సార్ కలిగివుంది. సెల్ఫీ కెమెరా 13ఎంపీ ఉంది.
రూ. 15వేలలోపు ధరతో ఈ స్థాయిలో కెమెరాను అందించడం విశేషం.
రెమ్ మీ నోట్ 7 ప్రో ఫోన్ కెమెరా క్లారిటీ విషయం ఇతర మొబైల్స్ మధ్య పోటీ పెంచుతున్నట్లే కనిపిస్తోంది. 48మెగా పిక్సెల్స్ ఉండటంతో ఫొటోలను చాలా స్పష్టంగా తీసుకునే అవకాశం ఉంటుంది.
జియోమీ రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను అందిస్తోంది.
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ గల ఫోన్ ధర: రూ.13,999
6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజి గల ఫోన్ ధర: రూ. 16,999
ఎంఐ ఎ2(MI A2)
జియోమీ సెకండ్ ఆండ్రాయిడ్ వన్‌తో ఎంఐ ఎ2 మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 15,000 ధరలో మంచి కెమెరా క్లారిటీ గల ఈ ఫోన్ రావడం పోటీని పెంచుతోంది. ఎంఐ ఎ2 డ్యూయెల్ కెమెరాలను కలిగివుంది.
డ్యూయెల్ రేర్ కెమెరా: 12ఎంపీ+20ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 20ఎంపీ, కాగా, ఈ ఫోన్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్లాష్ కలిగివుంది.
ఎంఐ ఎ2తో మంచి స్పష్టత కలిగిన ఫొటోలను తీయవచ్చు. కెమెరాతో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
రెండు వేరియెంట్లలో భారతదేశంలో ఈ మొబైల్స్ సంస్థ విడుదల చేసింది.
1. 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజీ(రూ. 11,999)
2. 6జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజీ(రూ. 15,999)
రియల్ మీ 2 ప్రో(Realme 2 Pro)
రూ. 15,000 ధరల విభాగంలో లభించే మంచి కెమెరా గల ఫోన్లలో రియల్ మీ 2 ప్రో కూడా ఉంది.
రియల్ మీ 2ప్రో 16మెగా పిక్సెల్స్ రేర్ కెమెరాను కలిగివుంది.
మరో కెమెరా 2మెగా పిక్సెల్స్ కలిగివుంది.
పగలు తీసుకునే ఫొటోలు మంచి క్లారిటీతో వస్తాయి. సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్స్ ఉంది.
పొర్ట్‌రేట్ మోడ్ కూడా బాగుంది.
వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో కూడా ఈ ఫోన్‌తో మంచి క్లారిటీ ఫొటోలను తీసుకోవచ్చు.
రియల్ మీ 2 ప్రో మూడు వేరియెంట్లలో లభ్యమవుతోంది
1. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ(రూ. 11,990)
2. 6జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజీ(రూ. 13,990)
3. 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజీ(రూ. 15,990)
ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1(Asus Zenfone Max Pro M1)
ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్ కూడా మనదేశంలో భారీ స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. మొదట 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ తీసుకొచ్చిన సంస్థ.. ఆ తర్వాత 6జీబీ ర్యామ్‌తో మంచి కెమెరా ఫీచర్లతో ముందుకు వచ్చింది.
3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్ల ఫోన్లు డ్యూయెల్ కెమెరాలను కలిగివున్నాయి.
రేర్ కెమెరాలు: 13ఎంపీ(ఓమ్ని విజన్ సెన్సార్, f/2.2)+
5ఎంపీ డెప్త్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్
6జీబీ ర్యామ్ వేరింట్‌లో 16మెగా పిక్సెల్స్(f/2.0), +5ఎంపీ కెమెరా
ఇక సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. 16మెగా పిక్సెల్స్ కలిగివుంది
6జీబీ వేరియెంట్ కెమెరాలు స్పష్టతతో కూడిన ఫొటోలను తీస్తున్నాయి.
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజీ(రూ. 8,499)
4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజీ(రూ. 10,499)
6జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజీ(రూ. 12.499)
Nokia 6.1 Plus
Nokia 6.1 Plus కూడా రూ.15,000లలోపు మంచి కెమెరా క్లారిటీ గల మొబైల్ ఫోన్ల విభాగంలో ఒకటిగా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే..
4జీబీ ర్యామ్, 64జీబీ రోమ్(400జీబీ వరకు విస్తరించుకోవచ్చు)
డ్యూయెల్ కెమెరా: 16ఎంపీ+5ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 16ఎంపీ
నోకియా 6.1 ప్లస్ ధర: రూ. 14,399.
చదవండి: ఏది బెటర్: శామ్సంగ్ గెలాక్సీ ఎ20 Vs రెడ్‌మీ నోట్