32ఎంపీ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3: 24న రిలీజ్

By rajashekhar garrepally  |  First Published Apr 19, 2019, 11:58 AM IST

జియోమీ నుంచి రెడ్‌మీ వై3(Redmi Y3) ఏప్రిల్ 24న భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఫీచర్లు బహిర్గతమైనప్పటికీ.. ఇప్పుడు ప్రధాన  ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. సెల్ఫీ కీలకంగా ఉన్న మన మార్కెట్లో ఈ ఫోన్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది.


జియోమీ నుంచి రెడ్‌మీ వై3(Redmi Y3) ఏప్రిల్ 24న భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఫీచర్లు బహిర్గతమైనప్పటికీ.. ఇప్పుడు ప్రధాన  ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. సెల్ఫీ కీలకంగా ఉన్న మన మార్కెట్లో ఈ ఫోన్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

ఏప్రిల్ 24న రెడ్‌మీ వై3ని భారత మార్కెట్లోకి విడుదలచేస్తున్నట్లు రెడ్‌మీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ కామర్స్ దిగ్గజం  అమెజాన్ ఆన్‌లైన్ రిటైలర్‌లోనే ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. 

Latest Videos

లాంగ్ బ్యాటరీ లైఫ్

తాజాగా రెడ్‌మీ వై3కి సంబంధించిన బ్యాటరీ వివరాలు వెల్లడయ్యాయి. మీరు ఎప్పుడూ రనౌట్ కాలేరు అంటూ తన బ్యాటరీ సామర్థ్యాన్ని గురించి రెడ్‌మీ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చింది. 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగివుందని తెలిపింది. రెడ్‌మీ వై2 3080ఎంఏహెచ్ బ్యాటరీ కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.

Y should your phone's battery last just a day? The power of 4000mAh arriving on 24-04-2019.
RT if you're excited! pic.twitter.com/7WH3SZpEuP

— Redmi India (@RedmiIndia)

రెడ్‌మీ వై3 గ్రేడియంట్ బ్యాక్

రెడ్‌మీ వై3 బ్యాక్‌సైడ్ గ్రేడియంట్ ఫినిష్‌తో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ కలర్ బ్లూ, పర్పుల్, ఎల్లో రంగులు మిక్సింగ్‌గా ఉంది. ఇంకా మరిన్ని రంగుల్లో కూడా ఈ మొబైల్ లభించే అవకాశం ఉంది. 

32ఎంపీ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3 మార్కెట్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరా శామ్సంగ్ ఐఎస్ఓసెల్ బ్రైట్ జీడీ ఫీచర్‌ కలిగివుంది. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.

click me!