తైవాన్ కంప్యూటింగ్ దిగ్గజం ఆసుస్.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్2(Asus ZenFone Live L2) ను ఏప్రిల్ నెలలోనే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 అప్‌డేట్ వెర్షన్ మొబైల్‌గా ఆసుస్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: తైవాన్ కంప్యూటింగ్ దిగ్గజం ఆసుస్.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్2(Asus ZenFone Live L2) ను ఏప్రిల్ నెలలోనే విడుదల చేసింది. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 అప్‌డేట్ వెర్షన్ మొబైల్‌గా ఆసుస్ ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఆసుస్ గ్లోబల్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్2 అబ్సోలేట్ ఆండ్రాయిడ్ 8 ఒరియోతో నడుస్తోంది. టాప్, బాటమ్ బెజల్స్ స్పోర్ట్స్ డిజైన్‌తో ఆకర్షణీయంగా రూపొందించబడింది.
వివిధ మార్కెట్లలో విభిన్న వేరియెంట్లను విడుదల చేస్తోంది. ఫీచర్లు విషయాలు బయటికొచ్చినప్పటికీ ఫోన్ ధర, ఎప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, త్వరలోనే ఈ మొబైల్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
రాకెట్ రెడ్, కాస్మిక్ బ్లూ కలర్లలో ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్2 లభించనుందని తెలిసింది. ఈ రెండు కూడా గ్రేడియంట్ ఫినిష్‌తో రానున్నాయి.
ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్2 స్పెసిఫికేషన్స్
ఆండ్రాయిడ్ ఒరియోతోపాటు కంపెనీ జెన్ యూఐ 5 ఆన్ టాప్‌తో నడుస్తుంది. డ్యూయెల్ సిమ్(నానో).
5.5ఇంచ్ హెచ్‌డీ(720x1440) ఐపీఎస్ డిస్‌ప్లే
పవర్: క్వాడ్ కోర్-క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425ఎస్ఓసీ
ఆడ్రినో 505, ఆడ్రినో 308జీపీయూ
2జీబీ ర్యామ్
16జీబీ/32జీబీ స్టోరేజీ
మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్(2టీబీ వరకు విస్తరించుకోవచ్చు)
13ఎంపీ లేదా 8ఎంపీ ప్రైమరీ కెమెరా f/2.0లెన్స్
5 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా f/2.4సెల్ఫీ షూటర్
3000ఎంఏహెచ్ బ్యాటరీ.