ఆసుస్ తన భారత అభిమాన వినియోగదారుల కోసం శుక్రవారం ఓ తీపి కబురును చెప్పింది. తన రెండు ఉత్పత్తులపై ధరను తగ్గించినట్లు తెలిపింది. ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1లపై ఈ తగ్గింపు చేసినట్లు ప్రకటించింది.
ఆసుస్ తన భారత అభిమాన వినియోగదారుల కోసం శుక్రవారం ఓ తీపి కబురును చెప్పింది. తన రెండు ఉత్పత్తులపై ధరను తగ్గించినట్లు తెలిపింది. ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1లపై ఈ తగ్గింపు చేసినట్లు ప్రకటించింది.
భారతదేశంలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై రూ. 2000 తగ్గించినట్లు తెలిపింది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఆసుస్ ఈ రెండు ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫోన్లు కూడా దాదాపు ఒకే రకమైన ఫీచర్లను కలిగివున్నాయి. స్నాప్ డ్రాగన్ 430ఎస్ఓసీతోనే రెండు మొబైల్స్ నడుస్తాయి.
undefined
ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1, లైట్ ఎల్1 ధరల తగ్గింపు
ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1 భారత మార్కెట్లోకి రూ. 8,999 ధరతో ప్రవేశించింది. తాజాగా రూ.2000 తగ్గించడంతో ఇప్పుడు ఈ మొబైల్ రూ. 6,999కే లభించనుంది.
ఆసుస్ జెన్‌ఫోన్ లైట్1 విషయానికొస్తే ప్రస్తుతం రూ.6,999 ఉన్న దీని ధర తాజా తగ్గింపుతో రూ. 4,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్కౌంట్ ధరలను ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆసుస్ అందిస్తోంది.
ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1, లైట్ ఎల్1 స్పెసిఫికేషన్స్
ఈ రెండు ఫోన్లు కూడా ఒకే ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. 5.45ఇంచ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, రిజల్యూషన్ 1440x720పిక్సెల్స్, యాస్పెక్ట్ రేషియో 18:9.
ఈ రెండు ఫోన్లకు కూడా స్నాప్ డ్రాగన్ 430ఎస్ఓసీ ఉంది.
ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1: 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ
ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1: 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ
ఈ రెండు ఫోన్లు కూడా మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 256జీబీకి పెంచుకోవచ్చు.
13ఎంపీ రేర్ కెమెరాతోపాటు 5ఎంపీ లెన్స్, ఎఫ్/2.0అపర్చర్
ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1.. 8ఎంపీ సెల్ఫీ కెమెరా
ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1.. 5ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగివుంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.
ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం1 బ్యాటరీ సామర్థ్యం 4000ఎంఏహెచ్
ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 బ్యాటరీ సామర్థ్యం 3000ఎంఏహెచ్.
చదవండి: అండర్ Rs. 15,000: బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే..