ISL 2020: ఏటీకేకి జలక్ ఇచ్చిన జంషేడ్‌పూర్... 2-1 తేడాతో అద్భుత విజయం...

By team telugu  |  First Published Dec 7, 2020, 10:28 PM IST

 2-1 తేడాతో ఏటీకే మోహన్ బగాన్‌పై అద్భుత విజయం అందుకున్న జంషేడ్‌పూర్...

రెండు గోల్స్ చేసిన నెరిజుస్... ఏటీకే తరుపున ఏకైక గోల్ చేసిన రాయ్ కృష్ణ...


ISL 2020: సీజన్‌లో వరుస హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ఏటీకే మోహన్ బగాన్‌కి షాక్ ఇచ్చింది జంషేడ్‌పూర్ ఎఫ్‌సీ. 2-1 తేడాతో ఏటీకే మోహన్ బగాన్‌పై అద్భుత విజయం అందుకుంది జంషేడ్‌పూర్. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిని డ్రా చేసుకుని, ఓ మ్యాచ్‌లో ఓడిన జంషేడ్‌పూర్ 2020 సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. 

జంషెడ్‌పూర్ తరుపున నెరిజుస్ 30వ నిమిషంలో తొలి గోల్ సాధించగా... 66వ నిమిషంలో అతనే రెండో గోల్ సాధించి అద్భుతమైన ఆధిక్యం అందించాడు. జంషేడ్‌పూర్ 2-0 గోల్స్‌తో ఆధిక్యంలో ఉండగా ఏటీకే ప్లేయర్ రాయ్ కృష్ణ 80వ నిమిషంలో గోల్ చేశాడు.

Latest Videos

ఏటీకే మోహన్ బగాన్‌ గోల్స్ చేసేందుకు చాలా ప్రయత్నం చేసినా జంషేడ్‌పూర్ వారిని విజయవంతంగా అడ్డుకోగలిగింది. నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో ఉన్న ఏటీకే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా తొలి విజయాన్ని అందుకున్న జంషేడ్‌పూర్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.
 

click me!