కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించిన గోవా ఎఫ్‌సీ...
రెండు గోల్స్ చేసిన గోవా ప్లేయర్ ఎంజుల....
ISL 2020: గోవా ఫుట్‌బాల్ క్లబ్‌కి ఐఎస్‌ఎల్ 2020 సీజన్‌లో తొలి విజయం దక్కింది. కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించిన గోవా ఎఫ్‌సీ... పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. గోవా ఎఫ్‌సీ తరుపున ఎంజుల 30వ నిమిషంలో తొలి గోల్ చేయగా... ఆర్టిజ్ 52వ నిమిషంలో రెండో గోల్ అందించాడు.
గోమెజ్ 90వ నిమిషంలో గోల్ చేసి కేరళ బ్లాస్టర్స్ ఖాతా తెరిచాడు. ఎక్స్‌ట్రా టైమ్‌లో 94వ నిమిషంలో ఎంజుల రెండో గోల్ చేయడంతో 3-1 తేడాతో విజయాన్ని దక్కించుకుంది గోవా ఎఫ్‌సీ. నాలుగు మ్యాచుల్లో రెండు డ్రాలు చేసుకుని, రెండు మ్యాచుల్లో ఓడిన కేరళ బ్లాస్టర్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
రేపు ఝంషేడ్‌పూర్, ఏటీకే మోహున్ బగాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.