2-0 తేడాతో ఓడిశాను చిత్తు చేసిన ముంబై...
నాలుగు మ్యాచుల్లో మూడు హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ముంబై సిటీ...
పాయింట్ల పట్టికలో టాప్‌లోకి ముంబై...
ISL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో టైటిల్ కొడితే, ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబై సిటీ వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఓడిశా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది ముంబై సిటీ ఎఫ్‌సీ. ముంబై సిటీ ప్లేయర్ ఓగ్బీచీ 30వ నిమిషంలో పెనాల్టీని ఉపయోగించుకుని తొలి గోల్ చేయగా, 45వ నిమిషంలో బోర్గీస్ రెండో గోల్ చేశాడు.
ఓడిశా ఎఫ్‌సీ గోల్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టింది ముంబై. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ముంబై సిటీ... పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది.
మరోవైపు నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్‌ను డ్రా చేసుకుని, మూడింట్లో ఓడింది ఓడిశా. ఒకే ఒక్క పాయింట్ సాధించిన ఓడిశా... పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉంది. మూడుకి మూడు మ్యాచుల్లో ఓడిన ఈస్ట్ బెంగాల్ ఆఖరి స్థానంలో ఉండగా ఓడిశా 10వ స్థానంలో ఉంది.