ISL 2020: బెంగళూరుకి తొలి విజయాన్ని అందించిన సునీల్ ఛెత్రి... చెన్నయన్‌కి తొలి ఓటమి...

By team telugu  |  First Published Dec 4, 2020, 9:32 PM IST

సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న బెంగళూరు ఎఫ్‌సీ...

ఏకైక గోల్ చేసిన సునీల్ ఛెత్రి...


ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి తొలి విజయం దక్కింది. రెండు మ్యాచులు డ్రాగా ముగిసిన తర్వాత చెన్నయన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచి, సీజన్ 2020లో తొలి విజయాన్ని అందుకుంది బెంగళూరు.

భారత సీనియర్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి... బెంగళూరు తరుపున ఏకైక గోల్ సాధించాడు. గోల్ చేసేందుకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో చెన్నైయన్ ప్లేయర్లు విఫలం కాగా... బెంగళూరు గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ చేసిన గోల్ సేవ్స్ కూడా ఆ జట్టును ఇబ్బంది పెట్టాయి.

Latest Videos

56 నిమిషంలో దక్కిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న సునీల్ ఛెత్రి గోల్ చేయడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది. మూడో మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకున్న బెంగళూరు 5 పాయింట్లలో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. చెన్నయన్ ఆరో స్థానంలో ఉంది.

click me!