ISL2020: నార్త్ ఈస్ట్ యునైటెడ్ అద్భుత విజయం... ఈస్ట్ బెంగాల్ క్లబ్‌కి మరో ఓటమి...

By team telugu  |  First Published Dec 6, 2020, 4:32 PM IST

2-0 తేడాతో ఈస్ట్ బెంగాల్‌ను చిత్తు చేసిన నార్త్ ఈస్ట్...

పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకిన నార్త్ ఈస్ట్...

ఆఖరి స్థానానికి పడిపోయిన ఈస్ట్ బెంగాల్...


ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్ 2020 సీజన్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు జోరు చూపిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి ఎరగనా నార్త్ ఈస్ట్... రెండు విజయాలు, రెండు డ్రాలతో 8 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆట మొదట సగంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ సుర్‌చంద్ర సింగ్ సెల్ఫ్ గోల్ చేసి... నార్త్ ఈస్ట్ జట్టుకి బోనస్ అందించాడు.

ప్రత్యర్థి ఆటగాడు చేసిన తప్పిదంతో ఆధిక్యంలోకి వెళ్లిన నార్త్ ఈస్ట్... దూకుడైన ఆటతీరు చూపించింది. గోల్ చేసేందుకు ఈస్ట్ బెంగాల్ ఎంత ప్రయత్నించినా, వీలు కాలేదు. 90వ నిమిషం దాటిన తర్వాత రోచార్జెలా మరో గోల్ సాధించడంతో నార్త్ ఈస్ట్ ఆధిక్యం 2-0కి వెళ్లింది.

Latest Videos

సునాయస విజయం అందుకున్న నార్త్ ఈస్ట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా మూడు మ్యాచుల్లో ఓడిన ఈస్ట్ బెంగాల్ చివరి స్థానానికి పడిపోయింది. 

click me!