గోవా ఎఫ్‌సీ తరుపున ఏకైక గోల్ చేసిన ఏంజులో...
1-0 తేడాతో ఓడిశా ఎఫ్‌సీపై గోవా ఎఫ్‌సీ విజయం...
ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్‌లో గోవా ఎఫ్‌సీ వరుసగా రెండో విజయాన్ని అందుకుని, పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. తాజాగా ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో 0-1 తేడాతో విజయం సాధించింది గోవా ఎఫ్‌సీ.
గోవా ఎఫ్‌సీ తరుపున ఎంజులో మ్యాచ్ 45వ నిమిషంలో ఏకైక గోల్ సాధించాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక మ్యాచ్ డ్రా చేసుకుని, నాలుగింట్లో ఓడిన ఓడిశా ఎఫ్‌సీ... పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది.
ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకున్న ముంబై సిటీ టాప్‌లో ఉండగా, ఐదింట్లో మూడు మ్యాచులు గెలిచిన ఏటీకే మోహన్ బెగన్ రెండో స్థానంలో ఉంది.