ISL 2020: సూపర్‌లీగ్‌లో మరో సూపర్ డ్రా... బెంగళూరు, నార్త్ ఈస్ట్ మధ్య హోరాహోరీ పోరు...

By team telugu  |  First Published Dec 9, 2020, 10:07 AM IST

బెంగళూరు, నార్త్ ఈస్ట్ యూనిటైడ్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రా...

రెండు గోల్స్ చేసిన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ప్లేయర్ మచాదో... 

బెంగళూరు ఎఫ్‌సీ తరుపున జౌనన్, ఉదంట చెరో గోల్... 


ISL 2020: ఇండియన్ సూపర్ లీగ్ 2020 సీజన్‌లో మరో మ్యాచ్ ఫుట్‌బాల్ అభిమానులకు కావాల్సినంత కిక్ అందించింది. బెంగళూరు, నార్త్ ఈస్ట్ యూనిటైడ్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ప్లయర్ మచాదో రెండు గోల్స్ చేయగా... బెంగళూరు ఎఫ్‌సీ తరుపున జౌనన్, ఉదంట చెరో గోల్ చేశారు...

మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే మచాదో ఓ అదిరిపోయే గోల్ చేసి నార్త్ ఈస్ట్ యునైటెడ్‌కి ఆధిక్యం అందించాడు. అయితే 13 నిమిషంలో గోల్ చేసిన బెంగళూరు ఎఫ్‌సీ ప్లేయర్ జౌనన్ స్కోర్లు సమం చేశాడు. సెకండ్ హాఫ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ ప్లేయర్ ఉదంట 70వ నిమిషంలో గోల్ చేసి బెంగళూరుకి ఆధిక్యం అందించాడు.

Latest Videos

అయితే 78వ నిమిషంలో మచాదో రెండో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థి ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ రెండో స్థానంలో ఉండగా, బెంగళూరు ఎఫ్‌సీ నాలుగో స్థానంలో ఉంది. 

click me!