SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 3-0 తేడాతో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్న భారత అండర్19 ఫుట్‌బాల్ టీమ్..
శనివారం, పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఉదయం ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత పురుషుల స్క్వాష్ టీమ్, పాకిస్తాన్‌ని ఓడించి స్వర్ణం సాధించింది. సాయంత్రం భారత అండర్19 పురుషుల ఫుట్‌బాల్ టీమ్, SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 3-0 తేడాతో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది..
ఆట మొదటి రెండు క్వార్టర్లలో ఇరు జట్ల ఆటగాళ్లు ఎవ్వరూ గోల్ చేయలేకపోయారు. 64వ నిమిషంలో గోల్ చేసిన భారత ప్లేయర్ కిప్‌జెన్, బోణీ కొట్టాడు. ఆ తర్వాత ఆట 85వ నిమిషంలో కిప్‌జెన్ నుంచి మరో గోల్ వచ్చింది. ఆట 95వ నిమిషంలో గోయరీ మరో గోల్ చేయడంతో టీమిండియా 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంతో ఫైనల్‌ని ముగించి, టైటిల్ కైవసం చేసుకుంది..
3⃣Rd SAFF title in 2⃣0⃣2⃣3⃣ 😁🎆 ⚔️ 🐯 🏆 ⚽ pic.twitter.com/LZicjxv5lY
— Indian Football Team (@IndianFootball)
సెమీ ఫైనల్‌లో నేపాల్‌పై 1-1 (3-2) తేడాతో పెనాల్టీ షూటౌట్‌లో విజయం అందుకుని, ఫైనల్‌కి వచ్చింది భారత యువ ఫుట్‌బాల్ జట్టు.
భారత్‌కి ఇది మూడో U19 SAFF ఛాంపియన్‌షిప్ టైటిల్. ఇంతకుముందు 2019లో U18 ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని 2-1 తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది యువభారత్..
2015లో అండర్19 SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నేపాల్ చేతిలో 1-1 (5-4) తేడాతో షూటౌట్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచింది భారత్. 2022లో అండర్20 ఫార్మాట్‌లో జరిగిన SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని 5-2 తేడాతో ఓడించి రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంది భారత్..
ఈ ఏడాది జూలై 4న జరిగిన SAFF ఛాంపియన్‌షిప్ టైటిల్‌ని సునీల్ ఛెత్రీ కెప్టెన్సీలోని భారత సీనియర్ ఫుట్‌బాల్ టీమ్ కైవసం చేసుకుంది.