
Mohammad Habib Death: భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ మంగళవారం కన్నుమూశారు. 74 ఏళ్ల హబీబ్ కొన్నేళ్ల నుంచి డిమెన్షియా, పార్కిన్సన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ఈ సమస్యలతోనే హైదరాబాద్‌లో ఆగస్టు 15వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు.
హబీబ్ మరణంతో క్రీడాలోకంలో విషాదం నెలకొంది. 1965 నుంచి 1976 కాలంలో ఆయన ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత కోచ్‌గానూ టీమ్‌కు సేవలు అందించారు. 1977లో మోహన్ బగాన్ కోసం కాస్మోస్ క్లబ్‌కు హబీబ్ ప్రత్యర్థిగా దిగారు. ఆ మ్యాచ్‌లో లెజెండరీ పీలే కూడా ఆడటం గమనార్హం.
1970లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన ఇండియా ఫుట్‌బాల్ టీమ్‌లో హబీబ్ ఉన్నారు. ఈ జట్టుకు మరో హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ నయీముద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించారు.
Also Read: వన్డే ఫార్మాట్‌లో బీభత్స రికార్డ్.. 450 పరుగుల తేడాతో ఆ జట్టు సంచలన విజయం
మహమ్మద్ హబీబ్ 1949 జులై 17వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. అదే హైదరాబాద్‌లో 74 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. హబీబ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.