ఇడ్లీలను తినే అలవాటు లేదా? అయితే మీరు ఈ బెనిఫిట్స్ ను మిస్ అయినట్టే..!

By Mahesh RajamoniFirst Published Mar 30, 2023, 4:03 PM IST
Highlights

World Idli Day 2023: పెద్దవారు మాత్రమే ఇడ్లీలను ఎక్కువగా తింటుంటారు. నిజానికి ఇడ్లీలు ప్రతి ఒక్కరూ తినాల్సిన సూపర్ ఫుడ్. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

World Idli Day 2023: ఇడ్లీ సాంబార్ ను తినేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. నిజానికి ఇది ఇతర బ్రేక్ ఫాస్ట్ ల కంటే రుచి కాస్త తక్కువగా ఉన్నా ఆరోగ్య ప్రయోజనాల్లో మాత్రం వాటికంటే ముందు ప్లేస్ లో ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రధానమైన ఆహారాలలో ఇడ్లీ ఒకటి. నిజానికి ఇడ్లీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. ఇది సాంప్రదాయకంగా బియ్యం, మినప్పప్పుతో తయారుచేస్తారు. దీన్ని పులియబెడతారు. తర్వాత ఆవిరిలో ఉడకబెడతారు. తృణధాన్యాలు, పప్పు దినుసుల కలయిక ఫలితంగా ఇడ్లీల్లో ఎన్నో రకాల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అసలు ఇడ్లీలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బరువు తగ్గడం

ఇడ్లీలను ఆవిరిలో ఉడకబెట్టి తయారుచేస్తారు. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇవి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇడ్లీలు మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి, మధ్యాహ్న భోజన కోరికలను తగ్గించడానికి సహాయపడతాయి.

ఫైబర్, ఐరన్ కంటెంట్ లు ఎక్కువగా ఉంటాయి

ఇడ్లీల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే ఇవి కాయధాన్యాలతో తయారవుతాయి. అందుకే దీనిలో ఇనుము కూడా సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ రక్త లోపం లేకుండా చూస్తుంది.

ప్రోటీన్ అధికంగా ఉంటుంది

ప్రోటీన్లు జంతు వనరుల నుంచి ఎక్కువగా లభిస్తాయి. మన శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు కూడా వీటిలో ఉంటాయి. అయితే  ప్రోటీన్లు మొక్కల వనరుల నుంచి కూడా అందుతాయి. అయితే వీటిలో కొన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉండవు. తృణధాన్యాలు, పప్పుధాన్యాలలో కొన్ని అమైనో ఆమ్లాలు ఉండవు. అయితే వీటిని రెండవ తరగతి ప్రోటీన్లుగా పరిగణిస్తారు. మొక్కల వనరులను ఇడ్లీలో మాదిరిగా కలిపి తీసుకుంటే అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు అందుతాయి. ఇది మొదటి తరగతి ప్రోటీన్ అయిన జంతు వనరులతో సమానంగా మారుతుంది.

మెరుగైన శోషణ

మొదటి తరగతి ప్రోటీన్లు జంతు వనరుల నుంచి వస్తాయి. అలాగే మన శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తాయి. దీంతో మంచి శోషణ అందుతుంది. 

గట్ ఆరోగ్యానికి మంచిది

కిణ్వ ప్రక్రియ కారణంగా.. ఇడ్లీ ప్రోబయోటిక్స్ కు మంచి మూలం. అందుకే ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ ప్రత్యక్ష సూక్ష్మజీవులు. ఇవి మంచి జీర్ణ ఆరోగ్యం నుంచి ఆహారం నుంచి సూక్ష్మపోషకాల మెరుగైన శోషణ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ఇడ్లీలను తెల్లగానే కాకుండా రంగురంగుల్లో తయారుచేయొచ్చు. వీటిలో ఫైబర్, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉండటానికి మనం ఎక్కువ కూరగాయలను వేయొచ్చు. నచ్చిన కూరగాయలను సన్నగా తరిగి లేదా ప్యూరీగా చేసి పిండిలో కలుపుకుని ఇడ్లీలు వేస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

click me!