ఎండాకాలంలో చియా విత్తనాలను తింటే ఎన్నో లాభాలున్నాయో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Mar 30, 2023, 10:59 AM IST
Highlights

చియా విత్తనాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడటానికి చిన్నగా ఉన్నా.. దీనిలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గడమే కాదు మరెన్నో లాభాలను కూడా పొందుతారు. 

చియా విత్తనాలు పోషక పవర్ హౌస్. ఇవి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ విత్తనాలను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. అలాగే పండిస్తున్నాయి. చిన్నగా ఉండే ఈ విత్తనాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా వీటిని ఎండాకాలంలో తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

చియా విత్తనాల్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక ఔన్సు (28 గ్రాములు) చియా విత్తనాలలో 11 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం లు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో చియా విత్తనాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జీర్ణ ఆరోగ్యం

చియా విత్తనాలలో  ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది. చియా విత్తనాలలో ఉండే కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయినియంత్రిస్తుంది కూడా. 

యాంటీఆక్సిడెంట్లు

చియా విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, మంట నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఈ శక్తివంతమైన సమ్మేళనాలు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 

బరువు తగ్గడం

ఈ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి, ఆకలిని తగ్గించడానికి సహాయపడతతాయి. ఇవి కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించి.. చివరికి బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

చియా విత్తనాలను ఎన్నో రకాలుగా ఉపయోగించొచ్చు. అదనపు పోషణ కోసం వీటిని స్మూతీలు, వోట్మీల్, పెరుగుకు కలపొచ్చు. మీ రోజువారి భోజనంలో చియా విత్తనాలను తీసుకున్నా దీని ప్రయోజనాలు పొందుతారు. 

click me!