వేడి వేడిగా పిజ్జా దోశె వేస్తూ సైకిల్ పై అమ్ముతూ ఉంటాడు. సైకిల్ వెనక పొయ్యి, పెనం అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఆయన వీటిని సర్వ్ చేయడం విశేషం.
ఈ రోజుల్లో ఏ సుందులో తిరిగినా.. ఫుడ్ దొరికేస్తది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు మాత్రమే కాదు... స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా చోట్ల దొరుకుతుంది. ఈ క్రమంలో.. కొందరు దొశెలు, ఇడ్లీలు లాంటివి ఇంట్లోనే ప్రీపేర్ చేసుకొని.. వాటిని తీసుకువచ్చి సైకిల్ పై పెట్టి అమ్ముతుంటారు. అయితే.. ఈ వ్యక్తి మాత్రం అలా కాదు.. సైకిల్ మీద తిరుగుతూనే.. దానిమీదే పొయ్యి పెట్టుకొని వేడి వేడిగా దోశెలు వేసిస్తాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈయన గురించి తెగ వైరల్ అవుతోంది.
ముంబయికి చెందిన ఓ వ్యక్తి గత 25 సంవత్సరాలుగా సైకిల్ పై దోశెలు అమ్ముతున్నాడు. ఇటీవల ఓ యూట్యూబర్ ఆయనకు సంబంధించిన విషయాలను వీడియో తీసి తన యూట్యూబ్ లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది. ఆ వీడియోకి 13 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు.
వేడి వేడిగా పిజ్జా దోశె వేస్తూ సైకిల్ పై అమ్ముతూ ఉంటాడు. సైకిల్ వెనక పొయ్యి, పెనం అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఆయన వీటిని సర్వ్ చేయడం విశేషం. ఆ దోశపై కూరగాయలు, షెచువాన్ సాస్, గార్లిక్ చట్నీ, చీజ్ అన్నీ వేసి మరీ వెరీ టేస్టీగా అందిస్తాడు.
ఆయన దగ్గర చాలా రకాల దోశెలు ఉన్నాయి. రూ.60 నుంచి రూ.100 వరకు అమ్ముతారు. చాలా రుచిగా ఉంటాయట. అయితే.. ఆక్ష్నకు పెద్దగా గుర్తింపు దక్కడం లేదని తెలుస్తోంది. ఈ వీడియో ద్వారా ఆయనకు పాపులారిటీ పెరిగే అవకాశం ఉందని నమ్ముతున్నారు.