ఆరోగ్యానికి అవిసె గింజలు.. ఎన్ని ఉపయోగాలో..!

By telugu news team  |  First Published Jan 8, 2021, 4:16 PM IST

పరిమాణంలో మాత్రం చిన్నగా ఉంటాయి. ఈ అవిసె గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కూడా వాటిని వదిలిపెట్టకుండా తినేస్తారు. 


అవిసె గింజలు.. ఈ పేరు వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద దృష్టిపెట్టిన వారంతా వీటిని తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చూడటానికి మెరుస్తూ కనిపిస్తాయి. కొంచెం పుచ్చకాయ గింజెల్లాగానే ఉన్నా.. పరిమాణంలో మాత్రం చిన్నగా ఉంటాయి. ఈ అవిసె గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కూడా వాటిని వదిలిపెట్టకుండా తినేస్తారు. మరి ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూసేద్దామా..

అవిసె గింజల్లో చాలా పోషకాలున్నాయి. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్క‌లంగా ఉంటాయి. అవిసెల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, అల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Latest Videos

undefined

అవిసె గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. బ్రెస్ట్, ప్రోస్టేట్ కాన్సర్లతోపాటు మరికొన్ని కాన్సర్లను కూడా నిరోధించ‌గ‌ల‌వు. 
అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ‌శ‌క్తిని పెంపొందిస్తుంది. కొలెస్టరాల్ స్థాయిల‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.  

అవిసె గింజలు బీపీని కూడా నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. హైబీపీ ఉన్నవారికి అవిసెలు ఎంతో మేలు చేస్తాయి. 
మాంసాహారం తీసుకోని వారికి (శాఖాహారుల‌కు) అవిసె గింజల్లో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ల‌భిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అవిసెలు తిన‌డంవల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దానివ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటాం. ఆహారం త‌క్కువ‌గా తీసుకోవ‌డంవ‌ల్ల స్థూలకాయులు బ‌రువు త‌గ్గుతారు.

click me!