రోజూ చిన్న బెల్లం ముక్క తీసుకుంటే..

By telugu news team  |  First Published Dec 17, 2020, 2:38 PM IST

శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దాని వల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి సమస్యలు దూరమవుతాయి. 
 


మనలో చాలా మంది తీపి పదార్థాలు తినడం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. దీంతో.. ఏదో ఒక స్వీట్ తినాలని తహతహలాడుతుంటారు. అయితే.. అలా అని పంచదారతో చేసిన స్వీట్స్ ని ఎక్కువ తినలేరు. ఎందుకంటే.. పంచార ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అంటే.. అది బెల్లం అనే చెప్పాలి. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. కచ్చితంగా బెల్లం తీసుకుంటారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం..

బెల్లాన్ని తరచూ తింటే రక్తశుద్ధి జరుగుతుంది. హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరగడానికి ఇది సహకరిస్తుంది. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

Latest Videos

undefined


శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దాని వల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి సమస్యలు దూరమవుతాయి. 


బెల్లంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. రోజూ చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే నీరసం మీ దరిచేరదు. 


బెల్లంలో జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలతో పాటూ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. 

మతిమరుపుతో (డిమెన్షియా) బాధపడుతున్నవారు రోజూ బెల్లం ముక్క తినాలి. ఇందులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. రోజూ పరగడుపునే కాస్త నేతిలో ముంచుకుని బెల్లం ముక్కని తింటే మంచి ఫలితాలు వస్తాయి.

బెల్లం శరీరంలో క్లెన్సర్‌లా పనిచేస్తుంది. కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట, శ్వాసకోశనాళం వంటి ముఖ్యమైన భాగాల్లోని మలినాలను తొలగించేందుకు సహకరిస్తుంది. 


బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నీరు చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా బరువు తగ్గచ్చు. 


రాత్రి పడుకోబోయే ముందు రోజూ ఒక స్పూను తరిగిన బెల్లాన్ని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


రక్తహీనతతో బాధపడేవాళ్లు బెల్లాన్ని తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. బెల్లంలో ఇనుము శాతం ఎక్కువ. ఇది ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. 

click me!