పైనాపిల్ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

By Mahesh Rajamoni  |  First Published Mar 18, 2023, 4:33 PM IST

పైనాపిల్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ పండును తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి తెలుసా? 
 


పండ్లన్నీ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పండ్లు కొలెస్ట్రాల్ ను తగ్గించడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణమండల పండ్లు మన  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో ఒకటైన పైనాపిల్ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. పసుపు రంగులో జ్యూసీగా, తీయగా, పుల్లగా ఉండే పైనాపిల్ పండులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మనలో చాలా మందికి తెలియని కొన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఈ పండులో దాగున్నాయి. అన్నన్స్ కోమోసస్ అని కూడా పిలువబడే పైనాపిల్ ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తో పాటుగా ప్రతి భోజనంలో తినొచ్చు. అసలు ఈ పండును తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది

Latest Videos

undefined

పైనాపిల్ పండు ఫైబర్ కు గొప్ప మూలం. ఇది మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైనాపిల్ లోని ఎంజైమ్ లను బ్రోమెలైన్ అంటార. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.

గాయాలకు సహాయపడుతుంది

పైనాపిల్ గాయాలను తొందరగా తగ్గిస్తుంది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం. అయినప్పటికీ.. బ్రోమెలైన్ కొన్ని శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి వాపు లేదా మరేదైనా గాయం తర్వాత మానడానికి సహాయపడుతుంది. 

రోగనిరోధక శక్తి బూస్టర్

పైనాపిల్ ను శతాబ్దాలుగా వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి , మంటను తగ్గించడానికి సహాయపడతాయి.

ఆర్థరైటిస ను తగ్గించొచ్చు

ఈ పండులో ఉండే బ్రోమెలైన్ ఎంజైమ్లు నొప్పి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందేందుకు ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. పైనాపిల్ లోని యాంటీ ఫ్లేమేటరీ గుణాలు నొప్పిని కాస్త తగ్గించడానికి సహాయపడతాయి.

క్యాన్సర్ ను తగ్గించొచ్చు

 హెల్త్ లైన్ నివేదిక ప్రకారం.. పైనాపిల్ లోని సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

పైనాపిల్ ఒక ఉష్ణమండల పండు. దీన్ని ముక్కలుగా కట్ చేసి లేదా జ్యూస్ గా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అయితే కొంతమందికి పండు అలెర్జీ ఉంటుంది. అందుకే దీనిని తిన్న తర్వాత ఏవైనా సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.

click me!