బాదం పప్పు ఎలా తినాలి..? ఎంత తినాలి..?

By telugu news teamFirst Published Nov 19, 2020, 2:31 PM IST
Highlights

 చాలా మందికి ఈ బాదం పప్పు విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. అసలు బాదం పప్పుని ఎలా తినాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ లాగే తినేయాలా లేదంటే.. రాత్రంతా నానపెట్టి.. పొద్దునే పొట్టుతీసేసి తినాలా అన్న విషయంలో క్లారిటీ ఉండదు. 

పండ్లు మన శరీరానికి చాలా ఆరోగ్యకరం. అందుకే ప్రతిరోజూ ఏదో ఒక పండు తినాలని డాక్టర్లు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. కాగా.. పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది. రోజుకి కొన్ని గ్రాముల డ్రై ఫ్రూట్స్ తింటే.. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పెద్దలు కూడా చెబుతుంటారు.

ఈ డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పుది కీలక పాత్ర అని చెప్పవచ్చు. చాలా రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టడంతోపాటు.. జుట్టు రాలడం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాగా.. చాలా మందికి ఈ బాదం పప్పు విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. అసలు బాదం పప్పుని ఎలా తినాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ లాగే తినేయాలా లేదంటే.. రాత్రంతా నానపెట్టి.. పొద్దునే పొట్టుతీసేసి తినాలా అన్న విషయంలో క్లారిటీ ఉండదు. అంతేకాదు.. రోజుకి ఎన్ని తినాలనే విషయంలోనూ సందేహాలు ఉంటాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో  చూద్దాం..

బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు విస్తృతమైనవి, మరియు అవి తరచూ గుండె మరియు మెదడు లోపాలు, మధుమేహం, మలబద్ధకం, శ్వాస రుగ్మతలు, దగ్గులు, రక్తహీనత మరియు అసమర్థత నుండి ఉపశమనం కోసం ఆరోగ్యకరమైన పరిష్కారంగా ఉపయోగిస్తారు. బాదంపప్పులు తినడం వల్ల జుట్టు, చర్మం (సోరియాసిస్), మరియు దంత సంరక్షణకు సహాయం పడుతుండి.

బరువు తగ్గాలి అనుకునేవారికి బాదం పప్పు చక్కని పరిష్కారం. ప్రతిరోజూ వీటిని తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు గర్భం దాల్చాలనుకునే మహిళలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది.  బాదం పప్పులో ఫోలిక్  ఆసిడ్ ఉంటుంది. ఇది అబార్షన్ లాంటివి కాకుండా సహాయపడుతుంది.

ఒక కప్పు బాదం పప్పులలో సుమారు 11.5 గ్రాముల కొవ్వు మరియు 5 గ్రాముల ప్రోటీన్లు కలిగి ఉంటాయి. బాదంలో ఉండే కొవ్వు గుండెకు చాల మంచిది, మరియు శరీరం అంతటా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది

బాదం పప్పులలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, మరియు ఇతర ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు వంటి, బాదం మలబద్ధకం నిరోధించడానికి సహాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరచడానికి కూడా సహాయం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుంది కదా.. రోజూ ఎక్కువ మొత్తంలో తింటే మరింత ఆరోగ్యం కదా అని పొరపడకండి.

ఎందుకంటే.. దీనిని ఎక్కువ మొత్తంలొ తీసుకోకూడదు. కేవలం 4 లేదా 5 బాదం పప్పులు తింటే సరిపోతుంది.  ఇక దీనిని ఎలా తినాలి అనే విషయానికి వస్తే.. రాత్రిపూట నీటిలో నానపెట్టి.. ఉదయాన్నే దాని పొట్టు తీసేసి తినాలి. అలా తింటే.. ఈ బాదంలోని పోషకాలన్నీ మీ సొంతమౌతాయి.

బాదం పప్పులు ప్రెగ్నెన్సీ మహిళలకు చాలా మంచిది. దీని వల్ల కడుపులో పెరిగే బిడ్డ శరీరానికి అన్ని రకాల పోషక విలువలు న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా ఇది మన జీర్ణ శక్తిని మన చర్మం కాంతిని పెంచుతుంది. కీళ్ల నొప్పుల సమస్య ను కూడా తగ్గిస్తుంది. మెదడు పవర్ కూడా పెరుగుతుంది.

click me!